బిజినెస్

సెనె్సక్స్ స్వల్ప పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 5: గత వారం చివరిలో 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి, ఆశాజనకంగా కనిపించిన స్టాక్ మార్కెట్ ఈవారం మొదటి రోజున స్వల్పంగా నష్టపోయింది. ఫలితంగా 34,000 పాయింట్ల కంటే సూచీ మరోసారి కిందకు పడిపోయింది. ట్రేడింగ్ మొదలైన తర్వాత ఆటుపోట్లకు గురవుతూ కొనసాగిన లావాదేవలు చివరికి 61 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఫలితంగా సెనె్సక్స్ 34,950.92 పాయింట్లకు చేరింది. అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో, ఒకానొక దశలో 34,811.60 పాయింట్లకు పడిపోయిన సెనె్సక్స్ ఆతర్వాత కొద్దిగా కోలుకుంది. అంతర్జాతీయ భవిష్యత్ మార్కెట్ సంకేతాలు ప్రతికూలంగా కనిపించడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రత్యేకించి ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలకు చెందిన షేర్ల అమ్మకాలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కాలంలో రూపాయి మారకపు విలువ పతనం, దేశీయ మార్కెట్‌లో ద్రవ్య లబ్ధత తగ్గడం వంటి అంశాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నాటి లావాదేవీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పడుతుందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో, దీపావళి సెలవుతో కూడిన ఈ వారం ఆరంభంలోనే మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. కొత్తగా పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తిని ప్రదర్శించలేదు. కాగా, ఉన్న షేర్లను అమ్మేందుకే చాలా మంది సుముఖత వ్యక్తం చేయడంతో, అమ్మకాల ఒత్తిడి మరింతగా పెరిగింది.