బిజినెస్

పడిపోయిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: దేశంలో బంగారం ధర మంగళవారం తగ్గింది. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ. 80 తగ్గి, రూ. 32,610కి చేరింది. విదేశీ మార్కెట్లలో బలహీన ధోరణి నెలకొనడంతో పాటు రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తగ్గింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా మంగళవారం తగ్గింది. కిలో వెండి ధర రూ. 240 తగ్గి, రూ. 39,300కు చేరింది. పారిశ్రామిక యూనిట్ల నుంచి తగినంత కొనుగోళ్లు లేకపోవడం వెండి ధర తగ్గడానికి దారితీసింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం లావాదేవీలలో బలహీన ధోరణి నెలకొనడంతో పాటు ‘దంతేరాస్’ తరువాత నగల వ్యాపారులు, రిటెయిలర్ల నుంచి తగినంత కొనుగోళ్ల మద్దతు లేని కారణంగా మంగళవారం బంగారం ధర తగ్గిందని వ్యాపారులు చెప్పారు. దేశంలో ప్రజలు బంగారం, వెండి, ఇతర విలువయిన లోహాలను కొనుగోలు చేయడానికి ‘దంతేరాస్’ను పవిత్రమయిన దినంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ప్రజలు ‘దంతేరాస్’ను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ప్రపంచ మార్కెట్‌లో చూస్తే, సింగపూర్‌లో బంగారం ధర 0.15 శాతం తగ్గి, ఒక ఔన్స్‌కు 1,229.30 డాలర్లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ. 80 తగ్గి, రూ. 32,610కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా రూ. 80 తగ్గి, రూ. 32,460కి చేరుకుంది. ‘దంతేరాస్’కు ముందు ప్రజల నుంచి గట్టి డిమాండ్ ఉండటంతో గత రెండు రోజుల్లో పది గ్రాముల బంగారం ధర రూ. 60 పెరిగింది. అయితే మంగళవారం సావరిన్ గోల్డ్ ధరలో ఎలాంటి మార్పు లేదు. యథాతథంగా కొనసాగింది. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,900 వద్ద కొనసాగింది. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న బలహీన ధోరణికి అనుగుణంగా దేశీయ మార్కెట్‌లోనూ మంగళవారం వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ. 240 తగ్గి, రూ. 39,300 వద్దకు చేరింది. వారం ప్రాతిపదికన డెలివరీ చేసే వెండి ధర కిలోకు రూ. 193 తగ్గి, రూ. 38,444కు చేరుకుంది. వెండి నాణేల ధరలో మాత్రం మంగళవారం ఎలాంటి మార్పు లేదు. వంద వెండి నాణేల కొనుగోలు ధర రూ. 76,000, విక్రయ ధర 77,000 వద్ద కొనసాగింది.