బిజినెస్

‘సింహాథ్రి’ని వేధిస్తున్న బొగ్గు కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ)ని బొగ్గు కొరత వేధిస్తుంది. బొగ్గు కొరత కారణంగా ప్రస్తుతం సింహాద్రి మొదటి 500 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు మంగళవారం షట్‌డౌన్ చేశారు. సింహాద్రిలోని 2,3,4 యూనిట్లు మాత్రమే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడు యూనిట్లు కలిసి లక్ష్యం కంటే తక్కువగానే గత మూడు రోజుల నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కార్మిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మూడు యూనిట్లు కలిసి సుమారు 800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లోని నాలుగు యూనిట్లలో కలిపి 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సుమారు 32 వేల టన్నుల బొగ్గు అవసరం. అవసరానికి అనుగుణంగా రోజూ 10 ర్యాక్‌ల బొగ్గు దిగుమతి కావాలి. కానీ ప్రస్తుతం మూడు ర్యాక్‌ల బొగ్గు అతికష్టం మీద దిగుమతి అవుతోంది.
ప్రస్తుతం సింహాద్రి కోల్‌యార్డ్‌లో బొగ్గు నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు ఒడిశా రాష్ట్రం శ్రీనంది కోల్‌పీల్డ్స్ నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటారు. అత్యవసర పరిస్థితిలో సింగరేణి నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి సింహాద్రి ఏ ప్రాంతం నుండి బొగ్గు అవసరమైనంత దిగుమతి కావడం లేదు. సింహాద్రికి ఈ సమస్య గత కొనే్నళ్ల నుంచి ఉన్నప్పటికీ ఇటీవల సక్రమంగా సింహాద్రికి బొగ్గు దిగుమతి కావడం లేదు. పవర్ గ్రిడ్‌కు సింహాద్రి అధికారులు డిక్లేర్డ్ కంజెమ్స్‌న్ (డిసి)ని తక్కువగా ఇస్తున్నారు. సింహాద్రి అధికారులకు అందిస్తున్న డీసీకి అనుగుణంగా పవర్ గ్రిడ్ అధికారులు ఎన్టీపీసీ అధికారులకు షెడ్యూల్డ్‌ను అందిస్తున్నారు. షెడ్యూల్డ్‌కు అనుగుణంగా సింహాద్రికి అవసరమైన విద్యుత్‌ను కలుపుకుని మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నారు. అయితే సింహాద్రి మొదటి 500 మెగావాట్లు యూనిట్‌ను వార్షిక నిర్వహణ పనులను నిమిత్తంగా షట్‌డౌన్ చేయాల్సి ఉంది. కానీ నిర్వహణ పనులకు అవసరమైన యంత్ర సామగ్రి అందుబాటలో లేక పోవడం కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో బొగ్గు కొరత ఎదురైంది. దీంతో సింహాద్రి మొదటి యూనిట్‌ను మంగళవారం షట్‌డౌన్ చేశారు. బొగ్గు దిగుమతి అనుకున్నంత మేర లేక పోవడం, రానున్న రెండ్రోజుల్లో ఈ పరిస్థతి మరీ అధికంగా ఉంటుందని భావించిన అధికారులు మొదటి యూనిట్‌ను షట్ డౌన్ చేసినట్లు తెలిసింది.
*
సింహాద్రి కోల్‌యార్డ్ (ఫైల్ ఫొటో)