బిజినెస్

జెఎస్‌డబ్ల్యు ఉక్కు ఉత్పత్తుల్లో 8 శాతం పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ది సాజన్ జిందాల్ నిర్వహణలోని జెఎస్‌డబ్ల్యు ఉక్కు కర్మాగారం ముడి ఉక్కు ఉత్పత్తుల్లో ఈయేడాది అక్టోబర్ నాటికి 7.7 వృద్ధి నమోదుచేసింది. అంటే ఇప్పటి వరకు 14.47 లక్షల టన్నుల ముడి ఉక్కును ఈ కర్మాగారం ఉత్పత్తిచేసింది. ఇదేకాలానికి గత యేడాది ఈ కంపెనీ 13.43 లక్షల టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసిందని కర్మాగార అధికారులు వివరించారు. గత నెలలో ఫ్లాట్ రోల్డ్ ప్రాడక్టుల ఉత్పత్తి 10.11 లక్షల టన్నులు జరగ్గా గత యేడాది ఇదేనెలలో జరిగిన 9.77 లక్షల టన్నుల ఉత్పత్తికంటే ఎక్కువ.
భారత్‌లో జెఎస్‌డబ్ల్యు గ్రూప్ కంపెనీలకు చెందిన 13 బిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ కలిగిన జెఎస్‌డబ్ల్యు ఉక్కు కర్మాగారం యేడాదికి 18 మిలియన్ టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తిచేస్తూ ఉక్కు కర్మాగారాల్లో అతిపెద్ద కర్మాగాల్లో ఒకటిగా పేరొందింది. కర్నాటక రాష్ట్రం విజయనగర్‌లో ఉన్న ఈ సంస్థకు చెందిన కర్మాగారం యేడాదికి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తిచేస్తూ దేశంలోనే అతిపెద్ద ఉక్కుకర్మాగారంగా పేరెన్నికకన్నది.