బిజినెస్

టైటాన్ త్రైమాసిక లాభాలు 8 శాతం పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: టైటాన్ కంపెనీ లిమిటెడ్ శుక్రవారం త్రైమాసిక లాభాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసే మూడు నెలల కాలానికి మొత్తం 301.11 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఈ సంస్ధ గడించింది. అంటే గడచిన యేడాదితో పోలిస్తే ఇది 8.34 శాతం అధికమని సంబంధిత అధికారులు ఇక్కడ వెల్లడించారు. గడచిన యేడాది ఈ కంపెనీ ఇదే కాలానికి 277.93 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. మూల నిధుల విషయానికి వస్తే ఇంటర్ ఆపరేట్ డిపాజిట్ల కింద 145 కోట్ల రూపాయలు ఈ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌లోనూ దాని అనుబంధ విభాగాల్లోనూ డిపాజిట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలావుండగా గత త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయం 4,595.13 కోట్లు గడించింది. గత యేడాది ఇదే కాలానికి 3,603.01 కోట్ల రూపాయలు గడించినట్లు అధికారులు వివరించారు. వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులతో సహా గత యేడాది ఆదాయాన్ని సంస్థ ప్రకటించగా గత సంవత్సరం జూలై నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీ కూడా జీఎస్టీలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలావుండగా ఈ సంస్థ బంగారు నగల వ్యాపారం కూడా 29 శాతం పెరిగింది. ఈ వ్యాపారం 3,582 కోట్లకు చేరిందని సంస్థ వివరించింది. వాచీల అమ్మకాలపై ఆదాయం సైతం 17 శాతం పెరిగి 676 కోట్లకు చేరింది. అలాగే కళ్లజోళ్ల వ్యాపారం కూడా 19 శాతం వృద్ధిని నమోదుచేసి గడచిన త్రైమాసికానికి 120 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు తెలిపారు. మొత్తానికి సంవత్సరార్థానికి జ్యువలరీ, వాచీల వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని ఈ సంస్ధ నమోదు చేసింది. ప్రతియేడాది వ్యాపారం పెరుగుతుండటం ఆనందంగా ఉందని టైటాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ తెలిపారు.

షేర్లను వెనక్కి తీసుకోనున్న హెచ్‌పీసీఎల్
న్యూఢిల్లీ, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో నడిచే జలవిద్యుత్ దిగ్గజం ఎన్‌ఎహెచ్‌పీసీ సంస్థ షేర్లను వెనక్కు కొనుగోలు చేసుకునేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 14న జరిగే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఉన్న పెట్టుబడుల్లో సుమారు 80వేల కోట్లు తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ సంస్థకు చెందిన బోర్డు తాజా నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఈ కంపెనీకి చెందిన పూర్తిగా చెల్లింపులు జరిగిన ఈక్విటీ షేర్లను వెనక్కు తీసుకోవాలన్న ప్రతిపాదన బుధవారం జరిగే బోర్డు సమావేశం ముందుకు వస్తుందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. అయితే ఇలా బైబ్యాక్ చేయనున్న మొత్తం షేర్లు ఎన్ని అనే విషయం కంపెనీ తెలియజేయలేదు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే ఈ కంపెనీ బైబ్యాక్ ప్రతిపాదనను తీసుకవచ్చిందని తెలిసింది.