బిజినెస్

పెరిగిన స్థూల పన్ను ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థూల పన్ను అదాయం రూ.21454 కోట్లు పెరిగింది. 2017 సెప్టెంబర్‌లో రూ.2,50,214 కోట్ల అదాయం ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.2,71,668 కోట్లు ఉంది. గత అక్టోబర్‌లో రూ.13,95,72 కోట్లు, నవంబర్‌లో రూ.11,38,90, డిసెంబర్‌లో రూ.2,49,264 కోట్లు, ఈ ఏడాది జవనరిలో రూ.1,19,280 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,12,545 కోట్లు, మార్చిలో రూ.3,50,791కోట్లు, ఏప్రిల్‌లో రూ.1,13,330 కోట్లు, మేలో రూ. 100768 కోట్లు, జూన్‌లో రూ.1,80,940 కోట్లు, జూలైలో రూ. 1,10,446 కోట్లు, అగస్టులో రూ.1,28, 647 కోట్లుగా ఉంది. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.2,71,668 కోట్లతో రూ.21454 కోట్లు అదాయం పెరిగింది.

84.86 లక్షల టన్నులుగా ఆవాల ఉత్పత్తి
న్యూఢిల్లీ, నవంబర్ 9: గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నాటికి ఆవాల ఉత్పత్తిలో పెరుగుదల నమోదైంది. 2009-10 మధ్య కాలంలో 66.08 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2010-11లో 81.79, 2011-12లో 66.04, 2012-13లో 80.29, 2013-14లో 78.77, 2014-15లో అత్యల్పంగా 62.82, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 67.97, 2016-17లో 79.17, 2017-18లో 83.22 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది అదే సమయానికి 84.86 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది.

పెరిగిన యూరియా దిగుమతి
న్యూఢిల్లీ, నవంబర్ 9: గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో యూరియా దిగుమతి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం 32.04 శాతం లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి కాగా, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి అది 33.35శాతం లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 4.54 శాతం ఉండగా, ప్రస్తుతం 6.95శాతంగా దిగుమతిగా ఉంది. అత్యల్పంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 0.44 శాతం దిగుమతి కాగా, అత్యధికంగా గత ఏడాది నవంబర్‌లో 8.43 శాతంగా యూరియా దిగుమతి పెరిగింది. ఈ ఏడాదిలో అత్యధికంగా మేలో 7.28శాతం, జూన్‌లో 7.86 శాతంగా పెరిగింది.