బిజినెస్

ప్రభావం చూపిన ఇంధన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 9: వైమానిక రంగంలో తక్కువ వ్యయంతో అందుబాటులో ఉన్న జాతీయ ప్రధానాస్రమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 2018 సంవత్సరానికి లాభాల్లో 11 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ యేడాది 262 కోట్ల రూపాయల లాభాలను గడించినట్లు అధికారులు తెలిపారు. కేరళలోని కొచ్చిన్ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ వైమానికి విభాగానికి 2017లో 296.7 కోట్ల లాభాలు వచ్చాయి, పెరిగిన ఇంధన ధరలతోబాటు, గల్ఫ్‌లో చోటుచేసుకున్న ఆర్థిక ఒడిదుడుకులు ప్రభావితం చేయడం వల్లే లాభాల్లో 11 శాతం తగ్గుదల వచ్చిందని అధికారులు తెలిపారు. అయినా గడచిన మూడేళ్లుగా ఈ విమానయాన సంస్థ లాభాలను అందిస్తూనే ఉందని అధికారులు వివరించారు. మార్కెట్‌లో అనుకూల పవనాలు వీయనప్పటికీ 3,648 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించి గత యేడాదికంటే 8.7 శాతం అదనపు రాబడిని ఆర్జించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈయేడాది ఇంధన ధరల పెరుగుదల వల్ల యూనిట్ కాస్ట్‌కూడా పెరిగిందని ఆయన తెలిపారు. కాగా ఈ ఎయిర్‌లైన్ విభాగం ఈ యేడాది ఇప్పటివరకు 3.89 మిలియన్ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇది గత యేడాదితో పోలిస్తే 13.7 శాతం అధికమని శ్యామ్ సుందర్ తెలిపారు. అలాగే రోజువారీ ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగం కూడా గడచిన యేడాదికంటే పెరిగిందని వివరించారు. ఈ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం మధురై, కోయంబత్తూర్, విజయవాడలకు సైతం సేవలను ఈ యేడాది విస్తరించిందని తెలిపారు. ఇరవై నాలుగు బోయింగ్ 737-800 విమానాలతోబాటు, 13 అంతర్జాతీయ విమానాలను సైతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తోంది. అలాగే 18 దేశవాళీ విమానాలు కూడా ఈ సంస్థ నడుపుతోంది.