బిజినెస్

భలే మంచి చౌక బేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: ఇప్పుడిక కార్ల వంతు.. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా కార్లను బకాయిల వసూళ్లలో భాగంగా బ్యాంకర్లు అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా, ఆయన నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2014 జనవరి 31 నాటికి బకాయిపడింది 6,963 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఇప్పుడు వడ్డీలతో కలిసి సుమారు 9,500 కోట్ల రూపాయలకు చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాటి వసూలుకు ఇప్పటికే ఇక్కడున్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను, ఇతర ఆస్తులను అమ్మడం కోసం బ్యాంకులు వేలాన్ని నిర్వహించాయి. అయితే అసలు స్పందనే లేకపోవడంతో ఖంగుతిన్న బ్యాంకులు.. తాజా కార్ల వేలంలోనైనా విజయం సాధించాలని భావిస్తున్నట్లుంది. అందుకే 8 కార్లను 13.70 లక్షలకే అమ్మేస్తున్నాయి. ఈ మొత్తానికి లోబడి ఆయా కార్లకు ప్రారంభ ధరలు నిర్ణయిస్తారు. అంతకు మించి బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల ఆగస్టు 25న ఈ కార్లకు వేలం జరగనుండగా, ఆగస్టు 23 బిడ్ల దాఖలుకు చివరి తేది. ఈ వేలాన్ని ఎస్‌బిఐ అనుబంధ సంస్థ ఎస్‌బిఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ కార్లను ఈ నెల 29న, ఆగస్టు 5న చూసుకోవచ్చు. కింగ్‌ఫిషర్ హౌస్ బ్యాక్‌యార్డులోనే వీటిని పార్క్ చేసి ఉంచారు. ఇక కార్ల పరిశీలన తర్వాత ఎంతకు కొంటారో నిర్ణయించుకుని బిడ్లు దాఖలు చేయవచ్చు. ప్రతీ కారుకు బిడ్‌లో పేర్కొన్న మొత్తంలో పదో వంతు డిపాజిట్‌గా చెల్లించాలి. అలాగే ఈ వేలంలో పాల్గొనేవారు 2,000 రూపాయల రిజిస్ట్రేషన్ చార్జీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దాదాపు మూడేళ్ల క్రితమే విమానయాన సేవలకు దూరమవగా, ఈ రుణాలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించాయి కూడా. ఎస్‌బి ఐసహా మరికొన్ని బ్యాంకులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, ఐడిబిఐ రుణం కేసు లో మాల్యా మనీలాండరింగ్, సిబిఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. ఇక ఎస్‌బిఐకి అత్యధికంగా సుమారు 1,600 కోట్ల రూపాయలు బకాయిపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ఐడిబిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు చెరో 800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 650 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 550 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 410 కోట్లు), యూకో బ్యాంక్ (రూ. 320 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ. 310 కోట్లు)లకు బకాయిపడింది. వీటితోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ల నుంచీ రుణం తీసుకుంది. కాగా, ఆస్తుల వ్యవహారం కోర్టుల్లో ఉండటంతోనే వేలానికి స్పందన కరువైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయాలే దీనికి కారణమంటున్నారు పలువురు. ఇటీవల మాల్యా వ్యక్తిగత విమానం వేలానికీ స్పందన కానరానిది తెలిసిందే.