బిజినెస్

నీరసపడిన బుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ మదుపరులు అనాసక్తిని ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో శుక్రవారం నాటి లావాదేవీలు మందకొడిగా సాగాయి. ఆటుపోట్ల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్ మధ్యలో కోలుకున్నట్టు కనిపించినప్పటికీ, ఆతర్వాత క్రమంగా క్షీణించింది. ఫలితంగా సెనె్సక్స్ 79.13 పాయింట్లు కోల్పోయి 35,158.55 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు రోజుల సెలవుల అనంతరం మొదలైన ట్రేడింగ్ పట్ల మదుపరులు ఆసక్తిని ఏమాత్రం ప్రదర్శించలేదు. శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్ ఉండదు కాబట్టి, సోమవారం విడుదలయ్యే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో పెట్టుబడిదారులు ఉన్నట్టు కనిపించింది. పెట్రోలు, డీజిల్ ధరల్లో తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు సానుకూల వాతావరణాన్ని సృష్టించడంతో, సీపీఐ ఎంతోకొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారుల్లోనూ దాదాపు అలాంటి ఆలోచనే ఉన్నట్టు శుక్రవారం నాటి ట్రేడింగ్ తీరు చెప్పకనే చెప్పింది. దీనికితోడు ఐదు రాష్ట్రాలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను అదుపులోనే ఉంచడం ఖాయం. అదే విధంగా రూపాయి మారకపు విలువ పతనం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోకపోతే, ప్రతికూల పవనాలు వీస్తాయని, ఫలితంగా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఈ ప్రభావం తప్పక చూపుతుందని కేంద్రంలో అధికార ఎన్డీయే సర్కారు భయపడుతున్నది. కనీసం, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకైనా ధరలను అదుపులోనే ఉంచడం అనేది కేంద్రానికి అత్యవసరం. ఇది కూడా మార్కెట్‌కు ఊతమిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. సీపీఐపై ఈ ఎంత వరకు ప్రభావం పడుతుందో చూసుకొని, ఆతర్వాత లావాదేవీల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నది మార్కెట్‌లో కీలకంగా వ్యవహరించే మదుపరులు ఎత్తుగడ. ఈ కారణంగానే, సీపీఐ నివేదిక, సూచీలు బహిర్గతమైన తర్వాతే పెట్టుబడులను ఉంచేందుకు సిద్ధమవ్వాలన్న ఉద్దేశంతో, శుక్రవారం నాటి లావాదేవీల్లో ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపలేదు. అదీగాక, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వచ్చే వారం మార్కెట్‌లో ద్రవ్య లబ్ధతను పెంచాలని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. ద్రవ్య లబ్ధత పెరిగితే, మార్కెట్ సూచీలు సానుకూలంగా మారడం ఖాయం. అందుకే, సోమవారం తర్వాతే తగిన నిర్ణయాలను తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కారణాలతో సెనె్సక్స్ స్వల్పంగా తగ్గగా, భారతి ఎయిర్‌టెల్ భారీగా నష్టపోయింది. ఆ కంపెనీ వాటాల ధర 2.45 శాతం తగ్గడం గమనార్హం. ఇన్ఫోసిస్,, టీసీఎస్, రిలయన్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఐటీసీ వంటి కంపెనీలు కూడా నష్టాలను చవిచూశాయి. వాటి షేర్ల ధర 2.5 శాతం వరకూ పడిపోయింది. కాగా, సెనె్సక్సలో లాభపడిన కంపెనీల్లో యస్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ కంపెనీ షేర్లు ఏకంగా 5.49 శాతం లాభాలను అందుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, హీరో మోటోకార్పొరేషన్, హెచ్‌యూఎల్, మారుతి తదితర కంపెనీల షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి.