బిజినెస్

వడ్డీ రేట్లు యథాతథం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశంలో ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో సానుకూలంగా ఉంటుందనే అంచనాలు ఉండటం వల్ల రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2018-19 ఆర్థిక సంవత్సరం మిగిలిన చివరి ఆరు నెలల కాలంలో కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ (కేఈఆర్) తన నివేదికలో పేర్కొంది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 అక్టోబర్‌లో 12 నెలల కనిష్ట స్థాయి 3.31 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 3.7 శాతం ఉండింది. 2017 అక్టోబర్‌లో ఈ చిల్లర ద్రవ్యోల్బణం 3.58 శాతం ఉండింది. 2017 సెప్టెంబర్‌లో 3.28 శాతం ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం, ఆ తరువాత ఈ సంవత్సరం అక్టోబర్‌లోనే కనిష్ట స్థాయిలో నమోదయింది. ‘ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్య విధానాన్ని నిర్ణయించడంలో ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉంటుందని అంచనా. అందువల్ల ఎంపీసీ ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల కాలంలో కీలక వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది’ అని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 2.8-4.3 మధ్య నమోదు అవుతుందని కేఈఆర్ అంచనా వేసింది. అంతకు ముందు వరుసగా రెండుసార్లు 0.25 శాతం చొప్పున కీలక వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ అక్టోబర్‌లో నిర్వహించిన సమీక్షలో మాత్రం యథాతథంగా కొనసాగించింది.