బిజినెస్

నిండా ముంచిన నిరర్థక ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్ బ్యాంక్ 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,822.71 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. ఈ బ్యాంకు ఇంతగా నష్టపోవడానికి నిరర్థక ఆస్తులే ప్రధాన కారణం. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో అలహాబాద్ బ్యాంక్ రూ. 70.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోని నికర నష్టంతో పోలిస్తే ఈ రెండో త్రైమాసికంలో నికర నష్టాన్ని స్వల్పంగా తగ్గించుకుంది. 2018-19 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ. 1,944.37 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అలహాబాద్ బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా సంవత్సరం క్రితంతో పోలిస్తే పడిపోయింది. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 5,067.78 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మాత్రం రూ. 4,410.72 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలహాబాద్ బ్యాంక్ మంగళవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన పత్రంలో ఈ వివరాలు వెల్లడించింది. 2018 సెప్టెంబర్ 30 నాటికి అలహాబాద్ బ్యాంక్ మొత్తం రుణాల్లో నిరర్థక ఆస్తులు 17.53 శాతానికి పెరిగాయి. 2017 సెప్టెంబర్ 30 నాటికి ఈ బ్యాంకు మొండి బకాయిలు, దాని మొత్తం రుణాల్లో 14.10 శాతం ఉండినాయి. 2017 సెప్టెంబర్ 30 నాటికి రూ. 21,454.27 కోట్లు ఉన్న అలహాబాద్ బ్యాంక్ మొత్తం నిరర్థక ఆస్తులు 2018 సెప్టెంబర్ 30 నాటికి రూ. 27,236.19 కోట్లకు పెరిగాయి.