బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్‌లో దిద్దుబాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: గడచిన అక్టోబర్ మాసంలో మదుపర్లు వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో 35వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఈ మార్కెట్‌లో జరిగిన దిద్దుబాట్ల క్రమంలో అదనంగా వచ్చిన పెట్టులతో కలిపి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలానికి వచ్చిన పెట్టుబడుల మొత్తం 81,300 కోట్లకు చేరిందని భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఏఎంఫ్‌ఐ) డేటా వివరించింది. రుణాలు, ఈక్విటీ విభాగాల్లో తలెత్తిన నిబంధనల ఉల్లంఘనలు వంటి ఘటలతో మార్కెట్‌లో సంభవించిన వొడిదుడుకుల నుంచి మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లాఘవంగా బయటపడిందని ఏఎంఎఫ్‌ఐ సీఈవోఎన్‌ఎస్ వెంకటేష్ తెలిపారు, ఈక్రమంలోనే గత నెలలో మదుపర్లు 35,529 కోట్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ లోని వివిధ పథకాల్లో పెట్టారని ఆయన తెలిపారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ డీఫాల్ట్ తర్వాత ముదురులు కొంత వెనకడుగు వేసినప్పటికీ తర్వాత చేపట్టిన దిద్దుబాటు చర్యలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. అందుకే ఈక్విటీ, ఈక్విటీ సంబందింత ఫండ్లలో 12,622 కోట్లు రాగా మిగిలిన ఫండ్లలో 55,296 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అలాగే బంగారం మారకం వాణిజ్య నిధులు (ఈటీఎఫ్) రూ.16 కోట్లు చేతులు మారాయి. ఇందులో 101 నుంచి 300వ స్థానంలో ఉన్న కంపెనీలు 12.8 శాతం పెట్టుబడులు పెట్టగా, అంతకుమించిన స్థానాల్లో ఉన్న చిన్నస్థాయి కంపెనీలే అదికంగా 27.7 శాతం పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు తెలిపారు.