బిజినెస్

ఆస్తుల అమ్మకాల ద్వారా రూ.800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 15: నష్టాలను మూటగట్టుకుంటున్న ఎయిర్ ఇండియా సంస్థ ఆస్తుల అమ్మకాల ద్వారా ఈ నష్టాలను కొంతవరకు పూడ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ ఈ సంస్థకు చెందిన నివాస, వాణిజ్య యోగ్యమైన 70 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించిందని ఓ సీనియర్ అధికారి గురువారం నాడిక్కడ తెలిపారు. ‘ఎయిర్‌లైన్స్ రియల్ ఎస్టేట్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్’ కింద ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పథకానికి సంబందించిన ప్రతిపాదనను 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం ప్రకారం 2014 ఏప్రిల్ నుంచి 2021 నాటికి ఎయిర్ ఇండియా ఐదు వేల కోట్లు కూడగట్టాల్సివుంది. 2013 ఆర్థిక సంవత్సరం నుంచి యేడాదికి 500 కోట్ల రూపాయలు కూడాలన్నది లక్ష్యం. ఎయిర్ ఇండియా ఆస్తులు దేశ వ్యాప్తంగా 16 ప్రముఖ పట్టణాల్లో ఉన్నాయి, వీటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని ఎంఎస్‌టీసీల ద్వారా వేలానికి పెట్టాలని పథకంలో పొందుపరిచారు. మొత్తం 70 ఆస్తులను ఈ వేలం ద్వారా విక్రయించి 700 నుంచి 800 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని అందనావేస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. గతంలో ఆస్తుల్లో కొన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. కాగా గత నెలలో ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పూనె, అమృత్‌సర్ వంటి కొన్ని ప్రాంతాల్లోని 14 ఆస్తులను ఎయిరిండియా అమ్మకానికి పెట్టింది. ఈ సంస్థకు 55వేల కోట్ల అప్పుల భారం ఉంది. సంస్థ ఆడిట్ అకౌంట్ల ప్రకారం 2016-17 సంవత్సరం నాటికే 47,145 కోట్ల రూపాయల అప్పులున్నాయి, ప్రధాన నగరాలైన ముంబయి, చెన్నైల్లోని ఆస్తుల మానిటైసేషన్ ద్వారా ఎయిర్ ఇండియా 543 కోట్ల రూపాయలు కూడగట్టుకున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2013లో ముంబయి నారిమన్ పాయింట్‌లోని ఐకానిక్ 23 అంతస్తుల భవనాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా 291 కోట్ల రూపాయలు కూడగట్టింది.

రిలయన్స్ ఇన్‌ఫ్రాకు తగ్గిన నికర లాభాలు
న్యూఢిల్లీ, నవంబర్ 15: అనిల్ అంబానీకగి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నికర లాభాల్లో 49 శాతం మేర తగ్గి, రూ.277.19 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంస్థ రూ. 543.8 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ మేరకు వివరాలను బీఎస్‌ఈకి దాఖలు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. కాగా ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో ఈ కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోల్చితే పెరిగింది. రూ.5898.7 కోట్ల నుంచి రూ. 7207.3 కోట్లకు ఆదాయం పెరిగింది. దేశంలోని ప్రముఖ వౌలిక సదుపాయ సంస్థల్లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి. ఇది అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది. విద్యుత్, రోడ్లు, మెట్రోరైలు, రక్షణ రంగంలో ఈ సంస్థ స్పెషల్ పర్పజ్ వెహికల్స్‌ను ఏర్పాటు చేసి పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోంది. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఈ సంస్థ ప్రాజెక్టు పనులు చేపడుతుంది. వెయ్యి కి.మీ పొడువు 11 రోడ్డు ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్మించింది.