బిజినెస్

ఏఎంసీకి త్వరలో కొత్త ఎండీ, సీఈవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 15: యూటీఐ ఆస్తుల నిర్వహణ కంపెనీ (ఏఎంసీ)కి కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకానికి కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే ఈ కంపెనీకి ప్రస్తుతం ఇంతియాజుర్ రహ్మాన్ అధినేతగా వ్యవహరిస్తున్నారు.
గత ఆగస్టులో లియోపూరీ ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే ఈ కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మధ్యంతర సీఈవోగా నియతులయ్యారు. గడచిన సెప్టెంబర్ మాసానికి ఈ కంపెనీ ఆస్తుల విలువ 1.65 లక్షల కోట్లకు చేరింది. కాగా యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీకి ఐదో అతిపెద్ద విభాగం. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల విధినిర్వహణానుభవం, ఆర్థిక సంస్థల నిర్వహణలో 15 సంవత్సరాల అనుభవం, ఆస్తుల నిర్వహణలో పదేళ్ల అనుభవం కలిగిన వారికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ నియామకంలో ప్రాధాన్యతను కల్పించాలని కంపెనీ నిర్ణయించింది. యూటీఐ ఏఎంసీ స్థాయి కలిగిన ఆర్థిక సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవంతోబాటు ఓ స్వతంత్ర వ్యాపార సంస్థను నిర్వహిస్తున్న వ్యక్తులనూ ఈ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే అభ్యర్థులు ఫైనాన్స్, ఎకనామిక్స్, లా పోస్టు గ్రాడ్యుయేట్లుగా ఉండి, అరవై సంవత్సరాల లోపు వయసుగలవారై ఉండాలని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా అనుభవం విషయంలో వెసులుబాటు కల్పించే అధికారం స్క్రీనింగ్ కమిటీకి ఉంటుంది.