బిజినెస్

రెండో విడతలో టోల్‌గేట్ల ద్వారా రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, నవంబర్ 15: జాతీయ రహదారుల్లో టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) పేరిట చేపట్టిన ప్రాజెక్టులకు అనూహ్య స్పందన రావడంతో ఈ ప్రాజెక్టుల ద్వారా రెండోవిడత సుమారు పదివేల కోట్ల రూపాయల ఆదాయం (పెట్టుబడులు) వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని తొమ్మిది జాతీయ రహదారుల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులు అతిపెద్ద విజయాన్ని సంతరించుకున్నట్లు ఆయన చెప్పారు. అనుకున్నదానికంటే ఎక్కువమంది ఈ ప్రాజెక్టుల నిర్వహణను సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చారని, తొలిరౌండ్‌లో 9,681 కోట్ల ఆదాయం వచ్చిందని, రెండో దఫా ఎన్‌హెచ్‌ఏఐకి 10వేల కోట్లకుపైగానే ఈ వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఇక్కడి మెగాపోలిస్‌లో గురువారం రోడ్లు, జాతీయ రహదారుల శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ సంయుక్తంగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొనేందుకు నితిన్ గడ్కరీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఓటీ ప్రాజెక్టులకు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ రోడ్‌షోను ఏర్పాటు చేశామన్నారు. రెండో విడతగా డీఓటీ పథకం కింద 586 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ దిశగా పారదర్శత, అవినీతి రహిత విధానాలను అనుసరిస్తున్నామని, పెట్టుబడిదారులకు అన్నివిధాలుగా భద్రత, మద్దతు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి టోల్ వసూళ్ల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వారికి సహకరిస్తామని మంత్రి తెలిపారు. దేశీయంగానేగాక, విదేశీ పెట్టుబడిదారులు సైతం రోడ్లు, వౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నిర్వహణకు ముందుకు వస్తున్నారని వారి నమ్మకాన్ని, పెట్టుబడులను కాపాడేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు. కాగా రెండో దఫా ప్రభుత్వం ఇస్తున్న దీర్ఘకాలిక టోల్ వసూళ్ల హక్కులు కైవసం చేసుకునేందుకు ప్రభుత్వం అందచా వేసినదానికన్నా అధిక సంఖ్యలో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. 30 సంవత్సరాల పాటు ఈ రాయితీ కాల వ్యవధి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలోని 681 కిలోమీటర్ల దూరం ఉన్న టోల్ తొమ్మిది టోల్ ప్రాజెక్టులు పనితీరులో ఆస్ట్రేలియాకు చెందిన మక్వారీ పురస్కారాన్ని సైతం అందుకోవడం జరిగింది.