బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు రూపాయి బలపడటం మదుపరులపై సానుకూల ప్రభావం చూపడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 119 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,600 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. సెనె్సక్స్ గురువారం కాస్త ఎగువ స్థాయి 35,145.75 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 35,402- 35,118.42 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 118.55 పాయింట్ల (0.34 శాతం) ఎగువన 35,260.54 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం తీవ్ర ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో స్వల్పంగా 2.50 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా గురువారం 40.40 పాయింట్లు (0.38 శాతం) పుంజుకొని, 10,616.70 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 10,646.50- 10,557.50 పాయింట్ల మధ్య కదలాడింది. రూపాయి విలువ పుంజుకోవడం, ఇతర ఆసియా మార్కెట్లలో పటిష్టమయిన ధోరణి నెలకొనడం, ఐరోపా మార్కెట్లు అధిక స్థాయిల వద్ద ప్రారంభం కావడం కూడా దేశీయ మార్కెట్లలో సానుకూల ధోరణి ఏర్పడటానికి తోడ్పడ్డాయి. అయితే, సెషన్ చివరలో స్పెక్యులేటర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల అంతకుముందు ఆర్జించిన లాభాలు కొంత తగ్గిపోయాయని వ్యాపారులు చెప్పారు. ఇదిలా ఉండగా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నాటి లావాదేవీలలో నికరంగా రూ. 277.38 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 272.34 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో అదాని పోర్ట్స్ గురువారం అత్యధికంగా 4.19 శాతం లాభపడింది. కోటక్ బ్యాంక్ 2.61 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, వేదాంత లిమిటెడ్, పవర్ గ్రిడ్, ఎల్‌అండ్‌టీ, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, రిల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు, ప్రైవేటు రంగ బ్యాంకు యెస్ బ్యాంక్ అత్యధికంగా 7.42 శాతం నష్టపోయింది. యెస్ బ్యాంక్ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా చేయడం ఆ బ్యాంకు షేర్ల విలువపై ప్రతికూల ప్రభావం చూపింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, విప్రో, టాటా స్టీల్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.16 శాతం వరకు పడిపోయింది.