బిజినెస్

నష్టాల బాటలోనే ఐడీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: మూలధన అవసరాలకు అనుగుణంగా వ్వవహరించడంలో నిలకడలేనితనం కారణంగా ఐడీబీఐ బ్యాంకు నష్టాలను చవిచూస్తోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ పేర్కొంది. గడచిన త్రైమాసికంలో ఈ బ్యాంకు మూలధన అవసరాల నిర్వహణలో విఘాతం ఏర్పడిందని ఈ కారణంగా నష్టాలు వచ్చాయని ఆ ఏజెన్సీ అంచనావేసింది. గడచిన త్రైమాసికంలో ఈ బ్యాంకు నష్టాలు 3,602 కోట్ల రూపాయలకు చేరాయని, అంతకుక్రితం యేడాది ఇదే కాలానికి 198 కోట్ల రూపాయల నష్టం మాత్రమే వచ్చిందని ఎస్ అండ్ పీ తెలిపింది. అనుచిత రుణ మంజూర్లు, అతితక్కువ వడ్డీకే రుణాలివ్వడం వంటి చర్యల కారణంగా ఈ నష్టాలు వస్తున్నాయని తెలిపింది. టైర్-1 మూలధన స్థాయి కనీసం 7శాతం ఉండాల్సివున్నా, ఈ బ్యాంకు 4.22 శాతానికే సరిపెట్టుకుందని తెలిపింది. అయితే ఈ నష్టాల పరంపర తాత్కాలికమేనని, జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఈ బ్యాంకులో పెట్టుబడులను 51 శాతానికి పెంచేందుకు నిర్ణయించిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సంస్థ పెట్టుబడులను గడచిన అక్టోబర్‌లో 7.98శాతం నుంచి 14.9 శాతానికి పెంచిందని, ఇందువల్ల బ్యాంకుకు 2,090 కోట్ల రూపాయలు సమకూరాయని ఐడీబీఐ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేష్ శర్మ గురువారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. ఎల్‌ఐసీతో తమ బ్యాంకు ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ ఆమోదిస్తే 20వేల కోట్ల మూలధనం బ్యాంకుకు సమకూరుతుందని ఆయన చెప్పారు.