బిజినెస్

విశాఖలో హిందూజా 1,040 మెగావాట్ల ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 25: హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ తమ తొలి బొగ్గు ఆధారిత ప్రాజెక్టును సోమవారం ప్రారంభించింది. హిందు జా గ్రూప్‌లో భాగమైన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ సంస్థ (హెచ్‌ఎన్‌పిసిఎల్) విశాఖలోని తమ 1,040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు వెల్లడించింది. 520 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ వివరించింది. ఈ ప్లాంట్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను తొలి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఎదగడానికి దోహదం చేస్తాయని సంస్థ అభిప్రాయపడింది. రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక విద్యుత్ అవసరాలను ఇది తీర్చనుంది. ఈ సందర్భంగా హెచ్‌ఎన్‌పిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పురీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ రెండు యూనిట్లను ప్రారంభించడంపట్ల ఆనందంగా ఉందన్నా రు. యూనిట్-1 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటుగా ఈ ఏడాది జనవరి నుంచి గ్రిడ్‌కు అనుసంధానిస్తున్నామన్నారు. ఈ యూనిట్లలో ఉత్పత్తి చేసిన విద్యుత్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అయిన సదరన్ అండ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇవ్వనున్నామన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక విద్యుత్ అవసరాలకు తొలుత ఈ విద్యుత్‌ను విశాఖపట్నం, దక్షిణాది ప్రాంతాల్లో అందించనున్నామని, ఈ పవర్ ప్లాంట్ అభివృద్ధిలో తమకు అన్నివిధాల సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, అన్ని పథకాలకూ విద్యుత్‌ను అందించేడమే కాకుండా 1998లోనే విద్యుత్ సంస్కరణలను దేశంలో ప్రారంభించిన రాష్ట్రాల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం విద్యుదుత్పత్తి ప్లాంట్‌ల సామర్థ్యం 15,311.17 మెగావాట్లయతే, 2019 సంవత్సరానికి దీనిని 29 వేల మెగావాట్లకు వృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.