బిజినెస్

ఆర్‌బీఐ నిర్ణయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టే స్టాక్ మార్కెట్‌కు ఊతం రావాలన్నా, వృద్ధిరేటు ఫలాలు అందరికీ దక్కాలన్నా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీసుకోబోయే చర్యలు లేదా నిర్ణయాలే కీలకం. దేశంలో ఏడు శాతానికి మించి వృద్ధి రేటు సాధ్యమవుతున్నప్పటికీ, ఇది పెరుగుతున్న జనాభాకు తగినంతగా లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రంజన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆర్‌బీఐకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, తన చెప్పుచేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐపై ఎన్నో కీలక బాధ్యతలు ఉన్నాయి. మొదటగా స్టాక్ మార్కెట్‌లో జరుగుతున్న మోసాలపై నిఘా పెట్టడంతోపాటు, మార్కెట్‌లో కీలక పాత్రధారులు జవాబుదారీతనం వహించేలా చర్యలు తీసుకోవడం అవసరం. మిగతా అంశాలు ఎలావున్నా, స్టాక్ మార్కెట్‌పై ఆర్‌బీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇన్‌ట్రా ట్రేడింగ్‌పై నిఘా పెంచాలి. వాస్తవ మదుపరులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దిశగా ఆర్‌బీఐ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనేది ఆసక్తిని రేపుతున్నది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, మార్కెట్ లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే ఆడిటర్లు, విలువను నిర్ధారించేవారికి జవాబుదారీతనం లేదు. వారు ఎవరికీ వివరణలు, సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫలితంగా, వారి విశే్లషణలు, వ్యాఖ్యానాలు, ప్రకటనలు భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడం సర్వసాధారణమైంది.
బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ, స్వప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కొంత మంది ఉద్దేశపూర్వకంగా మదుపరులు తప్పుతోవ పట్టిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అంశాలను ఆర్‌బీఐ కూలంకషంగా విశే్లషించాలి. మార్కెట్‌లో లావాదేవీలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులుచేర్పులు చేయాలి. అన్నింటినీ మించి, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలి. కేంద్రం ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు కనిపిస్తున్నందున ఆర్‌బీఐ మరింత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉంది.