బిజినెస్

పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత వారం నిలకడ కోల్పోయిన పసిడి ధర ఈ వారం మెరుగైన స్థితికి చేరుకుంది. ఈ వారం చివరి రోజైన శనివారం 135 రూపాయలు పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 32,150 రూపాయలకు చేరింది. వారం మొత్తాన్ని స్థూలంగా చూస్తే, ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, బంగారం ధర ఆకాశంలో విహరిస్తున్నదనే చెప్పాలి. పదో తేదీన 32,070 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం 12వ తేదీన 32,050 రూపాయల వద్ద ముగిసింది. 13వ తేదీన స్వల్పంగా పెరిగినప్పటికీ, 14వ తేదీన అత్యంత దిగువగా, 31,900 రూపాయలకు చేరింది. అయితే, శుక్రవారం 32,015 రూపాయలకు ఎగబాకిన పసిడి ధర శనివారం మరో 135 రూపాయలు పెరిగింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని అమెరికా మరింత పెంచనున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నీరసించాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గాయి. దీనితో మదుపరులు బంగారంపై ఆసక్తి చూపారు. దేశీయ జ్యుయెలరీ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమయ్యాయి. వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. అంతర్జాతీయ పరిణామాలకుతోడు నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడడంతో, కిలో వెండి కూడా 250 రూపాయలు పెరిగి, 38,150 రూపాయల ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రభావం చూపడంతో బంగారం ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.