బిజినెస్

ప్రైవేటు విమానయాన సంస్థల ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: ఇబ్బందుల్లో కూరుకుపోయిన ప్రైవేటు విమాన యాన సంస్థలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల బోర్డులు, మేనేజ్‌మెంట్లదేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు పేర్కొన్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్ వేస్‌కు తిరిగి కోలుకునేలా ప్రత్యేక బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడం వంటివి కుదరదని సోమవారం నాడిక్కడ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా జెట్ ఎయిర్ వేస్ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని, ప్రత్యేకించి ఆ సంస్ధ కోరిన మేరకు ఎయిర్‌పోర్టు ఆపరేటర్లకు చెల్లించాల్సిన బకాయిల కోసం మరికొంత సమయం కేటాయించాలన్న విజ్ఞప్తిపై స్పందించకూడదని పౌర విమానయాన శాఖ నిర్ణయించిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ అప్పుల్లో కూరుకుపోవడంతో ఈ సంస్థ పైలెట్లతోసహా సిబ్బందికి నెలవారీ వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది. గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి ఈ సంస్థ 1,261 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. దీనిపై మంత్రి సురేష్ ప్రభు స్పందిస్తూ ప్రభుత్వ పరిధిలోని సంస్థల వ్యవహారంపై పరిశీలించి ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతామే తప్ప ఓ ప్రైవేటు సంస్థ వ్యవహారాల్లో తలదూర్చబోమని, సంబంధిత బోర్డులు, మేనేజ్‌మెంట్లే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సివుంటుందని అన్నారు. బకాయిల చెల్లింపులకు సమయం కావాలంటే వారు ఎయిర్‌పోర్టు ఆపరేటర్లతో సంప్రదింపులు జరపాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే ఈ సందర్భంగా అన్నారు. కాగా మూలధన సమీకరణ కోసం తమ ప్రయత్నం జరుగుతోందని ఇందుకు కొంత సమయం పట్టవచ్చని జెట్ ఎయిర్‌వేస్ అంటోంది.