బిజినెస్

28 వేల స్థాయికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 292.10 పాయింట్లు పెరిగి 28,095.34 వద్ద స్థిరపడగా, ఆగస్టు 10 నుంచి చూస్తే ఇది గరిష్ఠ స్థాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 94.45 పాయింట్లు ఎగిసి 8,635.65 వద్ద నిలిచి 15 నెలల గరిష్ఠాన్ని తాకింది. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందగలదన్న ఆశాభావం, ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. పిఎస్‌యు, బ్యాంకింగ్, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఇన్‌ఫ్రా, టెక్నాలజీ, పవర్, ఐటి రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా సూచీలు లాభపడితే, జపాన్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలూ లాభపడ్డాయి.