బిజినెస్

తగ్గిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశంలో బంగారం ధర వరుసగా రెండో రోజు మంగళవారం తగ్గింది. పది గ్రాముల పసిడి ధర రూ. వంద తగ్గి, రూ. 32,000కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పటికీ, దేశీయంగా స్థానిక నగల వ్యాపారుల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో పసిడి ధర తగ్గింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా మంగళవారం తగ్గింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి, రూ. 37,900కు చేరుకుంది. పారిశ్రామిక యూ నిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర తగ్గింది. స్థానిక ఆభరణాల వ్యాపారులు, రిటెయిలర్ల నుంచి తగినంత డిమాండ్ లేకపోవడంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గిపోయిందని, అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొని ఉన్న పటిష్టమయిన ధోరణి దేశీయ మార్కెట్‌లో బంగారం ధర మరింత పడిపోకుండా నిలువరించగలిగిందని ట్రేడర్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ను పరిశీలిస్తే, లండన్‌లో బంగారం ధర 0.09 శాతం పెరిగి, ఒక ఔన్స్‌కు 1,226 అమెరికన్ డాలర్లకు చేరింది. వెండి ధర 0.07 శాతం పుంజుకొని, ఒక ఔన్స్‌కు 14.50 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర మంగళవారం రూ. వంద తగ్గి, రూ. 32,000కు చేరుకుంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర కూడా రూ. వంద తగ్గి, రూ. 31,850కి చేరుకుంది. దేశంలో పది గ్రాముల పసిడి ధర సోమవారం రూ. 50 పడిపోయింది. అయితే సావరిన్ గోల్డ్ ధరలో మంగళవారం ఎలాంటి మార్పు లేదు. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,800 వద్ద కొనసాగింది. బంగారం బాటలోనే కిలో వెండి ధర కూడా మరో రూ. 200 తగ్గి, రూ. 37,900కు చేరుకుంది. వారం ప్రాతిపదికన డెలివరీ చేసే వెండి ధర కిలోకు రూ. 251 తగ్గి, రూ. 36,769కి చేరుకుంది.