బిజినెస్

మరింత బలపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోనూ పుంజుకుంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 21 పైసలు పెరిగి, 71.46 వద్ద ముగిసింది. ఎగుమతిదారుల నుంచి డాలర్ విక్రయాలు పెరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడం, తాజాగా విదేశీ నిధులు నిరాటంకంగా తరలివస్తుండటం వంటి అంశాల కారణంగా రూపాయి విలువ పుంజుకుంది. అమెరికన్ డాలర్ కొన్ని ఇతర దేశాల కరెన్సీలతో మారకంలో బలహీనపడటం వల్ల రూపాయి వరుసగా ఆరో సెషన్‌లో బలపడింది. ఇప్పటివరకు ఆరు వరుస ట్రేడింగ్ సెషన్లలో కలిసి రూపాయి విలువ 143 పైసలు పెరిగింది.
‘భారత కరెన్సీ విలువను పరిరక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రంగంలోకి దిగి మద్దతివ్వడం ప్రారంభించిన తరువాత రూపాయి విలువ పుంజుకోవడం ఇది వరుసగా ఆరో సెషన్. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, తాజాగా ఎడతెరిపి లేకుండా విదేశీ నిధులు భారత క్యాపిటల్ మార్కెట్లలోకి తరలివస్తుండటం కూడా డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడానికి దోహదపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడంపై ఫెడరల్ రిజర్వ్ చేసిన అప్రమత్తమయిన వ్యాఖ్యల తరువాత అమెరికా డాలర్ విలువ రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా రూపాయి బలపడటానికి దారితీసింది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా నవంబర్ 22వ తేదీన రూ. 8,000 కోట్లను వ్యవస్థలోకి విడుదల చేస్తానని రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్‌లో మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ పటిష్టమయిన స్థాయి 71.39 వద్ద ప్రారంభమయింది. ఎగుమతిదారులు డాలర్ల విక్రయానికి పూనుకోవడంతో తరువాత మరింత పుంజుకొని, ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 71.27 వద్దకు చేరింది. అయితే, ఈ లాభాలను రూపాయి తరువాత నిలబెట్టుకోలేక పోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 21 పైసల ఎగువన 71.46 వద్ద ముగిసింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు పెరిగి, పది వారాల గరిష్ఠ స్థాయి 71.67 వద్ద ముగిసింది.