బిజినెస్

గెజిట్‌లో ‘సమీకరణ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సమీకరించడానికి ప్రభుత్వం 185 జిఓను జారీ చేసింది. దీన్ని సోమవారం గెజిట్‌లో ప్రచురించింది. రాజధాని అమరావతికి సుమారు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సునాయాసంగా సేకరించింది. ఇదే తరహాలో మచిలీపట్నం పోర్టు, కారిడార్‌కు భూమిని సమీకరించాలని భావిస్తోంది. కానీ అమరావతిలో భూసమీకరణకు, మచిలీపట్నంలో భూసమీకరణకు చాలా తేడా ఉంది. అమరావతిలో భూమిని సమీకరించడానికి ముందు ప్రభుత్వం ఆ ప్రాంతానికి హైప్ క్రియేట్ చేసింది. సంవత్సరానికి మూడు పంటలు పండే ప్రాంతంలో భూమి ఉన్న ప్రాంతంలో అధిక శాతం మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతులున్నారు. కొందరు రాష్ట్రానికి కొత్త రాజధాని వస్తున్న నేపథ్యంలో భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. మరికొందరు ఎకరాకు పాతిక లక్షల రూపాయలు కూడా పలకని తమ భూములు భవిష్యత్‌లో కోట్ల విలువ చేస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వానికి బదలాయించారు. ఇప్పటికీ ఉండవల్లి, పెనుమాకతోపాటు మరో గ్రామం రైతులు భూమిని ప్రభుత్వానికి ఇవ్వలేదు. భూసమీకరణకు రైతులు ముందు ససేమిరా అన్నప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి రైతులకు అండగా నిలబడతానని చెప్పారు. ప్రభుత్వం నెమ్మదిగా రైతులకు వాస్తవాలను వివరించడంతో వారంతా ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో మరే ఇతర పార్టీలు భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. అయితే మచిలీపట్నంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
సమీకరణ జీఓ ఏం చెబుతోంది?
మచిలీపట్నం మున్సిపాలిటీతోపాటు 28 రెవెన్యూ గ్రామాలను కలిపి ప్రభుత్వం ఇప్పటికే మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (మడ)గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మడ పరిధి 426.16 చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించింది. పోర్టు, పారిశ్రామిక కారిడార్‌తోపాటు మచిలీపట్నం ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మడ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ భూసమీకరణ కింద భూమిని తీసుకునేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. భూసమీకరణకు జారీచేసిన జీఓను సోమవారం ప్రత్యేకంగా విడుదల చేసిన గెజిట్‌లో ప్రచురించారు. ఈరోజు నుంచి 180 రోజుల్లోగా సంబంధిత అధికారులు భూసమీకరణ కార్యక్రమాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న పట్టా ఉన్న ఎకరం బీడు భూమికి వెయ్యి చదరపు గజాల నివాస స్థలం, 250 చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని ఇస్తారు. అలాగే చిత్తడి భూమికి వెయ్యి చదరపు గజాల నివాస స్థలం, 450 చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని ఇస్తారు. అలాగే ఎకరం లోపు ఎంత భూమి ఇచ్చినా బీడు భూమికి సంవత్సరానికి రూ. 30 వేలు, చిత్తడి భూమికి రూ. 50 వేల చొప్పున పదేళ్ల పాటు ఇస్తారు. అలాగే బీడు భూమికి సంవత్సరానికి రూ. 3 వేలు, చిత్తడి భూమికి సంవత్సరానికి రూ. 5 వేల చొప్పున పెంచుకుంటూ వస్తారు. ఈ ప్రాంతంలో ఉండే భూమిలేని పేద కుటుంబాలకు నెలకు రూ. 2,500 చొప్పున పదేళ్లపాటు పెన్షన్ చెల్లిస్తారు.
‘సామాజిక’ సమస్య
ఇదిలావుంటే, మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న 27 గ్రామాల నుంచి భూమిని సమీకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే చాలా గ్రామాలు భూసమీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేసి ప్రభుత్వానికి పంపాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. అమరావతిలో భూసమీకరణలో రైతుల పక్షాన ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు తమకు అండగా ఉండమని పవన్‌ను స్థానికులు కోరనున్నారు.
మచిలీపట్నంలో బూమ్ లేదు!
మచిలీపట్నంలో పోర్టు ఉన్నప్పటికీ అక్కడ భూముల విలువేమీ గణనీయంగా పెరగలేదు. మచిలీపట్నం, చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతున్న ప్రణాళిక కూడా ఆ ప్రాంత ప్రజల ముందు లేదు. అలాగే మచిలీపట్నం పోర్టు, కారిడార్ ఏర్పాటు వల్ల అక్కడ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరుతాయన్న స్పష్టత కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. అధికారులు కూడా మచిలీపట్నం పోర్టు ఖ్యాతిని ఇసుమంత కూడా పెంచలేకపోయారు. దీంతో మచిలీపట్నం ప్రాంత ప్రజలు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడం కన్నా, వ్యవసాయానే్న నమ్ముకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయమై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని ఏ మేజర్ పోర్టుకు అవసరం లేనంత భూమిని మచిలీపట్నం పోర్టు కోసం ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారని, అదికూడా ప్రభుత్వ భూమిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారని, నేటి ప్రభుత్వం భారీగా భూమిని ఎందుకు సమీకరిస్తోందో అర్థం కావడం లేదని అన్నారు.