బిజినెస్

బ్యాంకులు తప్పు చేస్తే శిక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల వల్ల వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి ఆర్‌బిఐ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ నిరంతరం తాము (అంబుడ్స్‌మెన్) వినియోగదారుల సేవలోనే ఉంటున్నామన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, షెడ్యూల్డ్ అర్బన్ సహకార బ్యాంకులు తమ పరిధిలోకి వస్తాయని, వినియోగదారులు తమకు ఎదురైన ఇక్కట్ల గురించి సంబంధిత బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారు నెల రోజులలోపు పరిష్కరించకపోతే, తమ వద్దకు (అంబుడ్స్‌మెన్) రావాలసి ఉంటుందని సూచిం చారు. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం 2015-16లో తమకు వచ్చిన ఫిర్యాదులు పెరిగాయన్నారు. 2014-15లో 4,366 ఫిర్యాదులు రాగా, 2015-16లో 5,910 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఎపి నుండి 2,801 ఫిర్యాదులు, తెలంగాణ నుండి 3,109 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఎస్‌బిఐకి సంబంధించినవి 26.2 శాతం, ఎస్‌బిఐకి అనుబంధంగా ఉన్న బ్యాంకులకు సంబంధించినవి 9 శాతం, ఇతర వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన ఫిర్యాదులు 27 శాతం ఉన్నాయన్నారు. మెట్రో నగరాల నుండి (హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ తదితరాలు) వచ్చిన ఫిర్యాదులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయని కృష్ణమోహన్ తెలిపారు. తమకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో (25.5 శాతం) ఎటిఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డులకు సంబంధించినవని అంబుడ్స్‌మెన్ అన్నారు. 2015-16లో 5,696 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. దాదాపు 22 శాతం ఫిర్యాదులను చర్చల ద్వారా పరిష్కరించామంటూ ఒక ఉదాహరణను గుర్తు చేస్తూ..ఒక ఆర్మీ ఆఫీసర్ అకౌంట్ నుండి అతడికి తెలియకుండా 4.82 లక్షల రూపాయలు ఎవరో డ్రా చేస్తే, బ్యాంకువాళ్లు పట్టించుకోలేదని, తాము ఈ కేసులో వినియోగదారుడికి పూర్తి డబ్బు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. సమాచార హక్కు కింద వచ్చిన అన్ని ఫిర్యాదులను (57) కూడా పరిష్కరించామన్నారు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ సేవలను ప్రజలకు తెలియచేసేందుకు అనేక మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నామని రెండు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకుల శాఖల్లో అంబుడ్స్‌మెన్ ఫోన్ నెంబర్లను ప్రముఖంగా ప్రదర్శనకు (డిస్‌ప్లే) చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరైన ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రీజనల్ డైరెక్టర్ ఆర్‌ఎన్ దాస్, జనరల్ మేనేజర్ మృణాళిని తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ ఎన్ కృష్ణమోహన్