బిజినెస్

సింగరేణి బొగ్గు రవాణాలో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: దేశంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి కాలరీసుకు భారీగా అవకాశాలు దక్కాయి. శనివారం ఒక్కరోజే సింగరేణి బొగ్గు గనుల నుంచి రోజుకు లక్షా 63వేల టన్నుల బొగ్గును సరఫరా చేసి కొత్త రికార్డును సృష్టించింది. సింగరేణి ఏరియాలోని 10 బొగ్గు కేంద్రాల నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తున్నారు.
విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున అందుకు సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేసి రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రోజూ 33 నుంచి 38 వ్యాగన్లతో బొగ్గు రవాణా జరుగుతోంది, అవసరాలను దృష్టిలో పెట్టుకుని 40 నుంచి 44 వ్యాగన్లను పెంచారు. తెలంగాణ జెన్కోకు రోజు 9 వ్యాగన్లు, ఏపీ జెన్కోకు 6, కర్నాటక ప్లాంట్‌కు 7, మహారాష్ట్ర జెన్కోకు 4, ఎన్‌టీపీఎస్‌కు 7, సింగరేణి థర్మల్ కేంద్రానికి 4, ఇతర కర్మాగారాలకు 5 బొగ్గు సరఫరా చేశారు. బొగ్గు సరఫరాకు అవసరమైన రైల్వే వ్యాగన్లను రైల్వేశాఖ ఏర్పాటు చేయడాన్ని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ్ధర్ అభినందించారు.

చిత్రం..బొగ్గు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న రైల్వే వ్యాగన్లు