బిజినెస్

గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి పెట్రోల్ పంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇంధన అవసరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ఓవైపు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు, గ్రామీణ వ్యవసాయదారుల అవసరాలను తీర్చేందుకు సరసమైన ధరలకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్ అందేలా తమ రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించబోతున్నాయి. ఇందుకుగాను రాష్ట్రంలో 2814 ప్రదేశాలను గుర్తించారు. ఈసందర్భంగా ఆదివారం నాడిక్కడ జరిగిన సమావేశంలో రాష్ట్ర సమన్వయ సంధానకర్త జీకేకేవీ ఉమాశంకర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ చీఫ్ మేనేజర్ సేరన్‌లాయి, భారత పెట్రోలియం హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ఏడీ ప్రభారాయ్, హెచ్‌పీసీఎల్ డిప్యూటీ జీఎం ఆర్ వేణుమాధవ్ విలేఖరులతో మాట్లాడారు. తొలిసారిగా కంప్యూటరైజ్ చేసిన డ్రా ఆఫ్ లాట్స్, బిడ్ తెరవడం వంటిది స్వతంత్ర ఏజెన్సీ కనుసన్నల్లో జరిగేలా చూస్తున్నామన్నారు. అన్ని రిటైల్ అవుట్‌లెట్స్ కూడా ఆటోమేషన్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయన్నారు. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటనలు జారీ చేస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని అనుసరిస్తూ డీలర్ల ఎంపిక ప్రక్రియ కూడా సరళతరం చేశామన్నారు. దరఖాస్తు ఫారం కూడా సరళతరం చేశామన్నారు. కేవలం ఎంపికైన అభ్యర్థులు మాత్రమే తమ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అర్హత నియమాలలో కూడా సడలింపు ఇచ్చామన్నారు. తాము గుర్తించిన ప్రదేశంలో అనువైన స్థలం కలిగి ఉండడం చాలా ముఖ్యమని, అయితే స్థలం లేనివారు కూడా దరఖాస్తు చేయవచ్చని వారు సూచించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చమురు కంపెనీల ప్రతినిధులు