బిజినెస్

ట్రిలియన్ రూపాయల అదనపు నిల్వలను ప్రభుత్వానికి బదలాయించనున్న ఆర్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: రిజర్వు బ్యాంకు వద్ద ప్రస్తుతం అవసరానికి మించిన నిధుల నిల్వలు ఉన్నందున సుమారు ఒక ట్రిలియన్ రూపాయల నిధులను ప్రభుత్వానికి బదలాయించవచ్చని అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ నిర్థారించే అవకాశాలున్నాయి. ఈమేరకు అదనపు మూలధనాన్ని నిల్వలను కమిటీ గుర్తించే అవకాశాలున్నట్లు ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. గత సోమవారం జరిగిన రిజర్వుబ్యాంకు బోర్డు సమావేశంలో ఈ మేరకు ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించగా ఈ వారం తర్వాత ఆ కమిటీని ప్రకటించే అవకాశాలున్నాయి, ‘ఆర్‌బీఐ ఆర్థిక, మూలధన ఫ్రేం వర్క్ (ఈసీఎఫ్) కోసం ప్రతిపాదించిన ఈ కమిటీ ఒకటి నుంచి మూడు ట్రిలియన్ రూపాయల నిధులను అవసరానికి మించిన నిధులుగా గురించే అవకాశం ఉందని, ఎందుకంటే దేశ తలసరి ఆదాయాన్ని బట్టి 0.5 నుంచి 1.6 శాతం నిదులుంటే సరిపోతుంద’ని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశే్లషకుడు మెర్రిల్ లించ్ సోమవారం నాడిక్కడ తెలిపారు. సెంట్రల్ బ్యాంకు ఒక ట్రిలియన్ రూపాయల నిధులను అదనపుకంటింజెన్సీ నిల్వలుగా ప్రభుత్వానికి బదలాయించవచ్చని, ఇలా పూర్తి మూలధన నిల్వలు సమకూరితే ఈ మొత్తం మూడు ట్రిలియన్ రూపాయలకు చేరే అవకాశాలున్నాయని మెర్రిల్ లించ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆర్‌బీఐ కంటిజెన్సీ నిధుల నిల్వలు 3.5 శాతం నిల్వలు ఉండాలనే నిర్థిష్ట నిబంధన ఉంటే 1.05 ట్రిలియన్ రూపాయల నిదులను బదలాయించవచ్చని నివేదిక సూచించింది. ఐతే ఈ పరిమితి ‘బ్రిక్స్ ఎకనామిక్స్’ కనీస పరిమితి నిబంధనలకన్నా 75 శాతం అధికమవుతుందని నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ కరెన్సీపై పరిమితులను విధించడం, పునర్నిర్ధారించిన బంగారం విలువల మేరకు 25శాతానికి (అమెరికన్ డాలర్‌కు 53.25 రూపాయలు) పరిమితి విధించడం ద్వారా 72వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బదలాయించవచ్చని నివేదిక సూచించింది. అలాకాకుండా ఉషాథొరాట్ కమిటీ సిఫారసుల మేరకు 18శాతానికన్నా మించి నిల్వలుండాలన్న సూచనమేరకు ప్రస్తుతం ఆర్‌బీఐ బుక్ ప్రకారం 28.3 శాతం నిల్వలకు బదులు 20 శాతానికి పరిమితంచేస్తే 3.11 ట్రిలియన్ రూపాయల నిధులను బదలాయించవచ్చని ప్రత్యేక కమిటీ నివేదిక సూచించింది. మొత్తానికి అదనపు మూలధన నిల్వలను ప్రభుత్వానికి బదలాయించడాన్ని ఏ నిబంధనా అడ్డుకోదని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ కంటిజెన్సీ నిధులను 7శాతం నిల్వచేయడం ‘బ్రిక్స్’ పరిమితి రెండు శాతంకన్నా అధికమని నివేదిక తెలిపింది. అలా పునర్నిర్థారిత నిధుల నిల్వకూడా పరిమితికి మించి ఉందన్న అధిప్రాయాన్ని వెల్లడించింది. కాగా తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.