బిజినెస్

మిత్సుబిషి చైర్మన్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, నవంబర్ 26: వాహనాల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మిత్సుబిషి చైర్మన్ కార్లొస్ గోషన్‌పై వేటు పడింది. అతనిని పదవి నుంచి తొలగిస్తూ పాలక మండలి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇటీవలే గోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలోని గొప్ప పాలనాదక్షుల్లో ఒకడిగా, మోటార్ రంగానికి టైకూన్‌గా పేరు తెచ్చుకొని, అందరి నుంచి జేజేలు అందుకున్న గోషన్ ప్రతిష్ట ఒక్కసారిగా కుప్పకూలింది. నిసాన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందుకు తీసుకుంటున్న పారితోషికాన్ని తక్కువ చేసి చూపించడాన్నది అతనిపై ఉన్న అభియోగం. కొన్ని సంవత్సరాల్లో, సుమారు 44 మిలియన్ డాలర్ల మేరకు ఆదాయాన్ని అతను దాచి ఉంచాడని, నిబంధనల ప్రకారం ఇది ఆర్థిక నేరం కిందకు వస్తుందని అధికారులు ప్రకటించారు. అతనిని టోక్యోలోని డిటెన్షన్ సెంచర్‌లో ప్రశ్నించడానికి రంగం సిద్ధమైంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, అత్యవసరంగా సమావేశమైన పాలక మండలి రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం, 64 ఏళ్ల గోషన్‌ను పదవి నుంచి తొలగించినట్టు ప్రకటించింది. బ్రెజిల్‌లో స్థిరపడిన ఫ్రాన్స్ దేశస్థుల కుటుంబంలో పుట్టిన గోషన్ మిత్సుబిషి మోటార్స్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. నిస్సాన్-రెనాల్ట్ తయారు చేసిన కారు మైలేజీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మైలేజీని చూపి మార్కెట్ వర్గాలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామంతో సమస్యల్లో పడిన మిత్సుబిషికి గోషన్ అండగా నిలిచాడు. కంపెనీపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడమేగాక, తమ వాహనాల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచగలిగాడు. ఒక రకంగా మిత్సుబిషికి వెన్నుముకగా నిలిచిన అతను ఆదాయాన్ని తక్కువగా చూపించడం జపాన్ నిబంధనల ప్రకారం ఆర్థిక నేరంగా పరిణమించింది. అధికారులు అరెస్టు చేసి, విచారణ చేపట్టడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అతనిపై వేటు పడిందనడంలో సందేహం లేదు.

చిత్రం..కార్లొస్ గోషన్