బిజినెస్

ఈ వారం.. శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 26: వరుసగా మూడు సెషన్లలో నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈవారం శుభారంభం చేసింది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఆటో రంగాలు కోలుకోవడంతో సెనె్సక్స్ 373.06 పాయింట్లు (1.07 శాతం) పెరిగి, 35,354.08 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంజీసీ, ఆటోతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్ ట్రేడింగ్ కూడా ఆశాజనకంగా కొనసాగింది. రూపాయి మారకపు విలువ కోలుకోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర కొద్దిగా తగ్గడం వంటి అంశాలు సైతం సోమవారం నాటి స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ప్రపంచ మార్కెట్లలో మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో ఆసియా మర్కెట్ కూడా అదే పంథాలో నడిచింది. మార్కెట్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయని, అందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకించి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్య లబ్ధత లోటు నుంచి కోలుకోవడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని, ఫలితంగా మార్కెట్ సూచీలు సానుకూలంగా మారేందుకు మార్గం సులభమైందని అంటున్నారు. ఈవారం మొదటి రోజు ఆశాజనంగా ప్రారంభం కావడంతో, ఈ అంచనాలు సరైనవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రూపాయి మారకపు విలువ భారీగా పెరగకపోయినప్పటికీ, పతనం నుంచి కోలుకోవడమేగాక, క్రమంగా బలపడుతున్నది. ఇది కూడా మార్కెట్‌కు శుభ పరిణామమన్నది విశే్లషకుల అభిప్రాయం. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడం దేశీయ ఆర్థిక స్థిరపడేందుకు దోహదం చేస్తున్నది. గత నెల రూపాయి విలువ భారీగా పతనంకాగా, క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా పెరిగింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈనెలలో మొదటి మూడు వారాల్లో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. ఈవారం మొదటి రోజే సెనె్సక్స్ లాభాల బాట పట్టడంతో, వారాంతం మరింత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో సోమవారం నాటి లావాదేవీల్లో పలు కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. వీటిలో ఎస్ బ్యాంక్‌ను ప్రధానంగా చెప్పుకోవాలి. దీని షేర్ ధర 7.19 శాతం పెరిగింది. కాగా, హీరో మోటార్స్ 5.02 శాతం (3,062.10 పాయింట్లు) లాభపడింది. హెచ్‌యూఎల్ 4.21 శాతం, విప్రో 3.76 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.27 శాతం లాభాలను ఆర్జించాయి. షేర్లు లాభపడిన కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్ (2.69 శాతం), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.30 శాతం), బజార్ ఆటో (2.23 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (2.20 శాతం), ఐటీసీ (1.85 శాతం), భారతి ఎయిర్‌టెల్ (1.84) కూడా ఉన్నాయి.
సెనె్సక్స్‌తోపాటు నిఫ్టీ కూడా ఈవారం మొదటి రోజైన సోమవారం మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. 101.85 పాయింట్లు (0.97 శాతం) మెరుగుపడి 10,628.60 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.
నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) విషయానికి వస్తే, ఎస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్, వేదాంత షేర్లు లాభాలను సంపాదించగా, ఇండియబుల్స్, గెయిల్, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ నష్టాలను ఎదుర్కొన్నాయి.