బిజినెస్

పెరిగిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: పది గ్రాముల బంగారం ధర సోమవారం 100 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ సెంటిమెంట్ బాగా పని చేయడంతో, దేశీయ నగల వ్యాపారులు కొనుగోలు పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. బులియన్ మార్కెట్ సానుకూల సూచీలను నమోదు చేయడంతో పది గ్రాముల బంగారం ధర 31,850 రూపాయలకు చేరింది. గత వారం 31,750 రూపాయలుగా ఉన్న పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 1,224.30 డాలర్లకు ట్రేడ్ అయింది. కాగా, బంగారంతోపాటు వెండి ధర కూడా పెరిగింది. మార్కెట్‌లో సానుకూల ధోరణును కనిపించడంతో కిలో వెండి 150 రూపాయలు పెరిగి 37,450 రూపాయలకు చేరింది. గత వారం 37,300 రూపాయల వద్ద ట్రేడింగ్ ముగిసింది.