బిజినెస్

జపాన్ టైకూన్ కార్లస్‌కు మరిన్ని కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, డిసెంబర్ 5: జపాన్ బిజినెస్ టైకూన్ కార్లస్ గోసన్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. ఇప్పటికే తన ఆదాయాన్ని సరిగ్గా వెల్లడించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొంటూ గత 15 రోజులుగా జైలులో ఉన్న నిస్సాన్ కంపెనీ మాజీ చైర్మన్ కార్లస్‌పై మరో అభియోగం నమోదు కానుంది. వాస్తవంగా తనకు వచ్చే జీతం కన్నా అతి తక్కువ చూపించి గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నాలుగు బిలియన్ ఎన్న్‌ల ఆదాయం చూపకుండా మోసం చేశాడని ఇతనిపై తాజా ఆరోపణ. దీంతో ఇతడిని ఈ కేసులో మళ్లీ అరెస్టు చేసే అవకాశాలున్నాయని జపాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థలు నిక్కే, మనీచీ వార్తపత్రిక సోమవారం వెల్లడించాయి. ఆ పత్రికల కథనం ప్రకారం కార్లస్ 2015 వరకు ఐదు బిలియన్ ఎన్‌లకు సంబంధించిన ఆదాయాన్ని తన రిటర్న్‌లలో చూపించలేదని ఆరోపణ. కాగా, ఆ ఈరోపణలపై వ్యాఖ్యానించడానికి జపనీస్ ప్రాసిక్యూటర్లు నిరాకరించారు. కాగా, వ్యాపార విస్తరణలో మేధావిగా పేరుగాంచిన కార్లస్ తన ఆదాయాన్ని తక్కువగా ప్రకటించాడన్న ఆరోపణపై ఈ ఏడాది నవంబర్ 19న టోక్యో ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతడిని విచారించడానికి అధికారులకు ఉన్న 22 రోజుల సమయం వచ్చే సోమవారానికి పూర్తి కానుంది. అయితే తమ విచారణ ఇంకా పూర్తి కాలేదని భావిస్తున్న అధికారులు అతడిని మళ్లీ అరెస్టు చేసి ఇంకో 22 రోజులు విచారించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు అతడికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
బిజినిస్ టైకూన్‌గా పేరుగాంచిన కార్లస్ నష్టాల్లో ఉన్న నిస్సాన్ కంపెనీని గట్టెక్కించి రెనాల్ట్‌కు సబ్సిడిరీ ఆదాయ వనరుగా మార్చాడు. కాని హఠాత్తుగా అతడిని అరెస్టు చేయడంతో అతడిని నిస్సాన్, మిత్‌సుబిషి మోటార్స్‌లో అన్ని పదవుల నుంచి తొలగించారు. మార్కెట్‌లో మంచి వ్యూహకర్తగా వ్యవహరించి కంపెనీలను అభివృద్ధి చేస్తాడని పేరున్న కార్లస్ కష్టాలు ఇప్పట్లో తీరేవి కావని వాణిజ్యవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.