బిజినెస్

నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సహకరించాల్సిన అగత్యమేదీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: గత రెండు నెలల కాలంగా నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఆర్థికంగా పుంజుకుంటున్న దృష్ట్యా ప్రస్తుతం వాటి ద్రవ్యలభ్యత కోసం సహకరించాల్సిన అగత్యం రిజర్వు బ్యాంకుకు లేదని ఆ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచా ర్య బుధవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఈమేరకు సెంట్రల్ బ్యాంకు కు ద్రవ్య లభ్యతపై ఓ ప్రత్యేక విధానాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సమస్య ఉత్పన్నమైన నాటినుంచే అలాంటి ఆర్థిక సంస్థలేవో ఆర్బీఐ లెక్కకట్టిందన్నారు. ఐతే ప్రస్తుతం ఆ సహకారానికి అవసరమైన పరిస్థితులు లేవని పరిశీలనలో తేలిందని ఐదవ బైమంత్లీ సమీక్షా సమావేశానంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. వివిధ రంగాలకు జరిగిన ఆర్బీఐ కేటాయింపుల పద్దులను పరిగణనలోకి తీసుకుంటే జిడీపీ అభివృద్ధి రేటుకంటే రుణాలే అధికంగా ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులను బదలాయించేందుకు, ఆస్తుల అభివృద్ధికి దోహదం చేసే లా ఆర్బీ ఐ చర్యలు చేపట్టిందని, తద్వారా ఆర్థిక సంస్థల ఇబ్బందులు తొలుగుతాయని, సర్వతోముఖ ఆర్థికాభివృద్ధికి ఇది దారితీస్తుందని భావిస్తున్నామన్నారు. పాక్షిక రుణ పరిమితి పెంపు (పీఈసీ) ద్వారా నాన్‌బ్యాంకిం గ్ ఫైనాన్స్ కంపెనీలకు బాండ్లపై ఇచ్చే రుణాల విషయంలో పూచీకత్తు వంటి అంశాల్లో నిబంధనలను సరళతరం చేశామని ఆచార్య తెలిపారు.