బిజినెస్

సెనె్సక్స్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: రెపో రేటును 6.50 శాతంగానే కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం బుధవారం స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఈవారం లాభాల బాటలో నడుస్తున్న సెనె్సక్స్ దూకుడుకు బ్రేక్ పడింది. 249.90 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ 35,884.41 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ కూడా 84.55 పాయింట్లు నష్టపోవడంతో 10,784.95 పాయింట్లకు పడిపోయింది. వడ్డీ రేట్లను పెంచకూడదని తీర్మానించిన ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల బాండ్ల రూపంలో బ్యాంకులు తప్పనిసరిగా తమ వద్ద ఉంచాల్సిన నిధుల మొత్తాన్ని తగ్గించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీనితో బ్యాంకుల వద్ద ద్రవ్య లబ్ధత పెరిగి, తద్వారా రుణాల శాతాన్ని పెంచడానికి వీలు కలుగుతుంది. అయితే, వడ్డీ రేటును పెంచరాదన్న తొలి నిర్ణయమే మదుపరులపై ఎక్కువగా ప్రభావాన్ని చూపింది. బ్యాంక్‌ల వాటాల ధరలు పడిపోయాయి. డాలర్‌కు రూపాయి మారకపు విలువ మరికొంత పతనం కావడం కూడా మార్కెట్‌ను నష్టాలపాలు చేసింది. ఇంట్రాట్రేడ్ ఆశాజనకంగా లేకపోవడంతో, మదుపరులు షేర్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపలేదు. అంతకు ముందు కొనసాగిన బుల్ రేస్ కారణంగా బుధవారం ఆరంభంలో మెరుగ్గా కనిపించిన ట్రేడింగ్ ఆతర్వాత మందగించింది. లాభాల నుంచి నష్టాల్లోకి పడిపోయింది. నిఫ్టీ పరిస్థితి కూడా అదే రీతిలో ముగిసింది. అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కూడా సెబీలో లావదేవీలపై ప్రభావం చూపాయని పీసీజీ, క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ చీఫ్ వీకే శర్మ వ్యాఖ్యానించారు. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్‌ను శాసించాయని, ఫలితంగా నష్టాలు తప్పలేదని పేర్కొన్నారు. కాగా, టాటా స్టీల్, టాటా మోటార్స్, వేదాంత, మహీంద్ర అండ్ మహీంద్ర, కోల్ ఇండియా, ఐటీసీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.