బిజినెస్

ఓడరేవుల సరుకు రవాణాలో బొగ్గు, ముడిచమురుదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: భారత ఓడరేవుల సరుకు రవాణాలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. ఇందులో ముడిచమురు, బొగ్గు రవాణాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గణాంకాల మేరకు సరుకు రవాణా ఈ ఏడాది దేశీయ అవసరాల మేరకు స్థిరంగా కొనసాగుతోంది. దేశానికి అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులు, ప్రస్తుతం ఉన్న నిల్వలు, కంటైనరేషన్ వల్ల ప్రయోజనాలు తదితర అంశాలను ఈ రేటింగ్ సంస్థ పరిగణనలోనికి తీసుకుంది. ప్రత్యేకించి గత రెండేళ్ల నుంచి బొగ్గురవాణా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిందని ఆ సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ సానుకూల పరిణామం మున్ముందుకు 2019 ప్రథమార్థం వరకు సాగుతుందని కూడా విశే్లషించింది. కాగా ఓడరేవుల సరుకు రవాణాలో ముడిచమురు, బొగ్గు, కంటైనర్లు వంటి భారీ సరుకు రవాణాలతోబాటు చిన్న, మధ్యతరహా రవాణా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని ఇక్రా అభిప్రాయపడింది. విద్యుత్ ఉత్పాదన రంగంలో పెరిగిన డిమాండ్‌తోబాటు, ప్రధాన పరిశ్రమల్లో పెరిగిన వినియోగం సైతం బొగ్గు రవాణాను ప్రభావితం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఓవైపు ప్రధాన పరిశ్రమలకు ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడినా ఉత్పత్తుల ధరలు ప్రోత్సాహకరంగా ఉండటం రవాణాకు ఊతమిచ్చిందని సంస్థ పేర్కొంది. దేశీయంగా గనులపై నిబంధనలు కఠినతరం అవుతున్న స్థితిలో ఇనుప ఖనిజం ఎగుమతులు గణనీయంగా తగ్గగా, దిగుమతులు వరుసగా గడచిన నాలుగు త్రైమాసికాల నుంచి పెరుగుతూనే ఉన్నాయని ఇక్రా విశే్లషించింది. సాగుతున్న ఓడరేవుల ఆధునీకరణ ‘సాగర్ మాలా’ పథకం కింద దేశంలోని ఓడరేవుల ఆధునీకరణ, పనితీరు సామర్ధ్యం పెంపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓడరేవుల కనెక్టివిటీని సైతం పెంచేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి వచ్చే ఐదు నుంచి పదేళ్లకు సరిపడా రోడ్డు మ్యాప్‌కు సైతం రూపకల్పన జరుగుతోంది. ప్రత్యేకంగా వ్యాపార, సంస్థాగత అభివృద్ధిలపై దృష్టి సారించి ఆదిశగా పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. రవాణాకు సరుకును పెంచాలన్న దీర్ఘకాలిక దృక్పథంతో సాగుతున్న ఈ లక్ష్యాల సాధనకు పలు సవాళ్లు అధిగమించాల్సివుందని ఎదురవుతున్నాయని ఇక్రా పేర్కొంది.