బిజినెస్

బ్యాంకుల పనితీరు మెరుగుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: గత ఏడాది పబ్లిక్ రంగ బ్యాంకుల పనితీరును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పనితీరును మెరుగుపరిచేలా అదనపుమూలధనం ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని, అనేక బ్యాంకులు ఈ సౌకర్యాన్ని సంతరించుకునే వీలుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా కుటీర (సూక్ష్మ), చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఖర్చు చేసేందుకు వీలుగా ఈ అదనపు మూలధనాన్ని ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో రెండో అదిపెద్ద ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగాన్ని అభివృద్థి చేసేందుకు వీలుగా కేవలం గంటలోపే ఒక కోటి రూపాయల రుణ మంజూరుతోబాటు, తదనుగుణంగా పర్యావరణ, కార్మిక చట్టాలకు సరళీకరించే విధంగా ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేక విధానాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు రెండో త్రైమాసిక పనితీరును ప్రకటించిన మీదట ఈ వారంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులతో చర్చలు జరుపుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. బ్యాంకుల అవసరాలను గుర్తించి ఈనెలాఖరు నుంచి వచ్చే నెల ప్రథమార్థ వరకు 54వేల కోట్ల అదనపు మూలధనాన్ని సమకూరుస్తుందని తెలిపారు. ఈ యేడాది ఇప్పటికే ఐదు పబ్లిక్ రంగ బ్యాంకులకు వడ్డీ చెల్లింపులు, ఇతర అవసరాల నిమిత్తం 11,336 కోట్ల మూలధన సహకారాన్ని అందించడం జరిగింది. నీరవ్‌మోదీ స్కామ్ కారణంగా దెబ్బతిన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు అత్యధికంగా 2,816 కోట్లు పొందగా, అలహాబాద్ బ్యాంక్ 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు 2,555 కోట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమకూర్చింది. 1.35 లక్షల కోట్ల మూలధనాన్ని బాండ్ల ద్వారా రాబట్టాలని లక్ష్యం పెట్టుకోగా కేంద్ర ప్రభుత్వం 82వేల కోట్లను రికాప్ బాండ్ల ద్వారా సమకూర్చింది.