బిజినెస్

టికెట్ రేట్లను 30 శాతం తగ్గించిన జెట్ ఎయిర్‌వేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే విమాన చార్జీలను 30 శాతం తగ్గించింది.
పరిమిత కాల ఆపర్ కింద ఈ చార్జీల తగ్గుదల ఉంటుందని ఆ సంస్థ బుధవారం నాడిక్కడ వెల్లడించింది. ఏడు రోజులపాటు అమలులో ఉండే ఈ ఆఫర్ బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. బిజినెస్, ఎకానమీ క్లాస్ బుకింగ్‌లకు ఈ ఆఫర్ ఉంటుందని ఆ సంస్థ అధికారులు వివరించారు. జెట్ ఎయిర్ వేస్ భాగస్వామిగా ఉన్న ఇతర విమానయాన సంస్ధల్లో సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. ఈ ఆఫర్ కింద తీసుకునే టికెట్లపై డిసెంబర్ 5 నుంచి 30వ తేదీలోగా ప్రయాణించాల్సివుంటుందని తెలిపారు. కొత్త ఢిల్లీ, ముంబయి నగరాల నుంచి ప్రయాణించే ఈ సంస్థకు చెందిన విమానాల 65 అదనపుఫ్రీక్వెన్సీలను ఇటీవల దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కొత్తగా ప్రకటించడం జరిగింది. అవి ఈనెల నుంచే ఆరంభం కానున్నాయని, ఇందులో భాగంగానే ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించినట్లు సంస్థ వివరించింది. జెట్ ఎయిర్ వేస్ లేదా కోడెషేర్ విమానాలతోబాటు ఎయిర్ ఫ్రాన్స్, రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ విమానాల్లో భారత్ నుంచి ఫ్రాన్స్‌కు, అలాగే సింగపూర్ నుంచి భారత్‌కు, గల్ఫ్, సార్క్, ఆమ్‌స్టర్ డ్యాం, లండన్, మాంచస్టర్, పారిస్ నగరాలకు వెళ్లేందుకు 30 శాతం రాయితీ, హాంగ్‌కాంగ్‌తోబాటు పైన పేర్కొన్న దేశాల నుంచి తిరిగి వచ్చేందుకు 25 శాతం రాయితీ వంతున అమలు చేస్తున్నట్లు వివరించారు.