బిజినెస్

పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశంలో బంగారం ధర గురువారం పది గ్రాములకు రూ. 170 పెరిగింది. ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పటిష్టంగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 170 పెరిగి, రూ. 32,120కి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ. 25 చొప్పున పెరిగి, రూ. 37,625 వద్ద ముగిసింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ కాస్త పెరగడం వల్ల వెండి ధర కూడా పెరిగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నందున డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయని ట్రేడర్లు చెప్పారు. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర పది గ్రాములకు రూ. 170 పెరిగి, రూ. 32,120కి చేరుకుంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా పది గ్రాములకు రూ. 170 చొప్పున పెరిగి రూ. 31,970కి చేరుకుంది. సావరిన్ గోల్డ్ ధర కూడా ఎనిమిది గ్రాములకు రూ. వంద చొప్పున పెరిగి, రూ. 24,900కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర అధిక స్థాయి వద్ద కొనసాగింది. న్యూయార్క్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 1,238.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి, ఒక ఔన్స్‌కు 14.39 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అదే విధంగా దేశీయ మార్కెట్‌లోనూ వెండి ధర కిలోకు రూ. 25 చొప్పున పెరిగి, రూ. 37,625 వద్దకు చేరుకుంది. అయితే, వారం ప్రాతిపదికన డెలివరీ చేసే వెండి ధర కిలోకు రూ. 856 పెరిగి, రూ. 37,250కి చేరుకుంది. అయితే, వెండి నాణేల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వంద వెండి నాణేల కొనుగోలు ధర రూ. 73,000, విక్రయ ధర రూ. 74,000 వద్ద కొనసాగింది.