బిజినెస్

లాభాలతో ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 28: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. వస్తు సేవల పన్ను( జిఎస్‌టి) మిల్లుపై సానుకూల సంకేతాలు, కార్పొరేట్ సంస్థల ఆదాయాలు మెరుగుపడ్డం వంటి సానుకూల అంశాలతో గురువారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెనె్సక్స్ 184 పాయింట్లు లాభపడి దాదాపు ఏడాది గరిష్ఠస్థాయి అయిన 28,208.62 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 15 నెలల గరిష్ఠస్థాయి అయిన 8,666.30 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఏసియన్ పెయింట్స్ నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.46 శాతం పెరిగిన నేపథ్యంలో ఆ కంపెనీ షేరు ధర ఏకంగా 6.14 శాతం పెరిగింది. అలాగే మారుతి సుజుకి షేరు 4.47 శాతం పెరిగింది. జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టల గడువు చివరి రోజున మదుపరులు కొనుగోళ్లకు దిగడం, అలాగే తమ పొజిషన్లను కొనసాగించడం మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో బలంగా ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత ఒక దశలో 28,240.20 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ చివరికి 184 పాయింట్ల లాభంతో 28,208.62 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఏడాది ఆగస్టు 7న సెనె్సక్స్ 28,236.39 పాయింట్ల వద్ద ముగిసిన తర్వాత ఇంత గరిష్ఠస్థాయికి చేరడం ఇదే మొదటిసారి. నిఫ్టీ సైతం 50.50 పాయింట్లు లాభపడి 8,666.30 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఏడాది ఏప్రిల్ 16 తర్వాత నిఫ్టీ ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. కాగా, ఆసియా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 14 షేర్లు లాభాల్లో సాగాయి. తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభాలు 58 శాతం తగ్గిన నేపథ్యంలో ఆ షేరు 3 శాతం మేర పడిపోయింది.