బిజినెస్

స్థిరమైన అభివృద్ధి దిశగా టాటా మోటార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాసింజర్ వాహనాల తయారీలో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తున్న మూడు అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటిగా ఎస్‌యూవీ హారియర్‌ను నిలపాలని టాటా మోటార్స్ భావిస్తోంది. పునరాభివృద్ధి చర్యల్లో తలమునకలై ఉన్న ఈ సంస్థ ఇప్పుడిప్పుడే అభివృద్థి చెందుతున్న హారియర్‌పై ప్రత్యేక దృష్టి నిలిపింది. పాసింజర్ వాహనాల విభాగంలో ప్రత్యేక వ్యూహం ద్వారా రాబోయే రెండేళ్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఈ విభాగంలో దేశంలో పేరెన్నికగన్న కంపెనీలకు తీసిపోని విధంగా తమ కంపెనీ ఉత్పత్తుల స్థాయి ఉందని విశ్వసిస్తున్నట్లు టాటా మోటార్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గుయెంటర్ బుట్స్‌చెక్ తెలిపారు. 2018-19 సంవత్సరానికల్లా ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్‌లో తమ కంపెనీ మూడో స్థానంలో నిలవాలని రెండేళ్ల క్రితం నిర్ణయించి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ ఏడో స్థానంలో ఉందని, గత యేడాది నెలవారీ గణాంకాల జాబితాలో అక్టోబర్‌లో తొలిసారి తమ కంపెనీ మూడోస్థానంలోకి ఎగబాకిందని, దాంతో తమ ఆశ్చర్యానికి అవధులు లేవని తెలిపారు.
ఈ పరిణామం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, అందుకే గడచిన యేడాది కాలంలో తమ కంపెనీ నెలవారీ గణాంకాల్లో మూడుసార్లు తొలి మూడు స్థానాల్లోకి ఎగబాకి సవాలు విసిరిందని బుట్స్‌చెక్ వివరించారు. మారుతీ సుజుకీ, హుండాయ్ మోటార్స్ ఇండియాలతో తమ కంపెనీ దీటైన పోటీని ఎదుర్కొంటోందన్నారు. పరిమితమైన కొత్త ఉత్పత్తులతో తమ కంపెనీ ఇలా పోటీనివ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈయేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు టాటామోటార్స్ 1,32,732 యూనిట్ల అమ్మకాలతో నాలుగవ స్థానంలో ఉందని, 25.65 శాతం అదనపు అభివృద్ధిని ఈ దిశగా సాధించామని ఆయన తెలిపారు. 10,44,749 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ అగ్రపీఠాన్ని ఆక్రమించగా, 3.26.178 యూనిట్ల అమ్మకాలతో హుండాయ్ రెండో స్థానంలో ఉంది. ఇక 1,45,462 యూనిట్ల అమ్మకాలతో మహీంద్రా అండ్ మహీంద్రా మూడోస్థానంలో నిలిచింది.