బిజినెస్

స్వచ్ఛందమా? ఉద్వాసనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై అనేకానేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఆయన స్వచ్ఛందంగానే ఆ నిర్ణయం తీసుకున్నారా? లేక కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడితెచ్చి, పరోక్షంగా అతనికి ఉద్వాసన పలికిందా? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. చాలాకాలంగా మోదీ సర్కారుకు ఉర్జిత్ వ్యవహార శైలి నచ్చడం లేదు. తన చెప్పుచేతల్లో ఉంటాడనుకున్న ఉర్జిత్ అందుకు భిన్నంగా నడచుకోవడం బీజేపీ సర్కారుకు, ప్రత్యేకించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మింగుడు పడడం లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. సుమారు నెల రోజులుగా ఉర్జిత్ రాజీనామా చేస్తారన్న వార్తలు షికారు చేయగా, సోమవారం ఆయనే అధికారికంగా రాజీనామా ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఉర్జిత్ స్పష్టం చేసినప్పటికీ, కేంద్రంతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వైదొలిగాడన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అనే రెండు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు భారత దేశ ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారాయని చాలాకాలంగా ఉర్జిత్ వాదిస్తున్నట్టు చెప్తున్నారు. అంతేగాక, ఆర్‌బీఐ వద్ద ఉన్న రిజర్వులు ప్రభు త్వం వినియోగించుకోవడానికి కాదని ఆయన తెగేసి చెప్తున్నారు. ఆ మొత్తాన్ని వివిధ పథకాల కోసం వాడాలన్న ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ సూచనలకు ఆయన సానుకూలంగా స్పందించలేదన్నది వాస్తవం. స్థూల జాతీయోత్పత్తి, వృద్ధిరేటు తదితర అంశాలపైన కూడా కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. దేశంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రస్తుతం నమోదవుతున్న ఏడు శాతం వృద్ధి రేటు ఏమాత్రం సరిపోదని, ఈ కోణంలో ఆలోచించి, కొన్ని సంస్కరణలను చేపట్టాలన్నది ఉర్జిత్ నేతృత్వంలోని ఆర్‌బీఐ అభివృద్ధి కమిటీ అభిప్రాయం. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు పెరుగుతుండగా, నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా భారత్‌లో కుంటుపడిందనే వాదనతో ఆర్‌బీఐ పరోక్షంగా ఏకీభవిస్తున్నది. ఒక రకంగా, ఈ రెండూ అనూహ్య పరిణామాలే. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకులం చేసే చర్యలే. దేశంలో సుమారు 25 సంవత్సరాలపాటు ఏటా ఏడు శాతం వృద్ధి రేటు అనేది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అద్దం పడుతుంది. అయితే, పెరుగుతున్న అవసరాలను బట్టి చూస్తే ఇది సరిపోదు. ఉద్యోగాల కోసం ఏటా ఎంతో మంది లేబర్ మార్కెట్‌లోకి వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఏడు శాతం వృద్ధితో సంతృప్తి చెందడం సరికాదు. అంతకంటే గొప్ప రేటును సాధించాల్సిన అవసరం ఉంది. ఈ ఆవశ్యకతను ఆర్‌బీఐ ఇది వరకే గుర్తించింది. దీనిపై సర్కారు వైఖరి మరోలా ఉండడంతో, చాలాకాలంగా ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొంది. ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని, ప్రభుత్వ జోక్యం ఉండరాదని ఉర్జిత్ వాదిస్తుండగా, ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు, ఇతరత్రా అవసరాల కోసం రిజర్వ్ నిధులను వాడడంలో తప్పులేదన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. మొత్తం మీద అనేకానేక విషయాల్లో భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, గవర్నర్‌గా కొనసాగలేనన్న అభిప్రాయంతోనే ఉర్జిత్ రాజీనామా చేసి ఉంటారన్న వాదన వినిపిస్తున్నది.