బిజినెస్

ఇండస్ట్రియల్ హబ్‌గా ‘అనంత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 30: అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందబోతోంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా నిత్యం కరవు కాటకాలకు నిలయమైన, రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన అనంత పురం జిల్లా పురోభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాకు 19 భారీ, మధ్యతరహా పరిశ్రమలు మంజూరయ్యాయి.
6,143 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమల ద్వారా 51,400 మందికి ఉపాధి లభించనుంది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు 2,095.22 ఎకరాల భూమిని కేటాయించే ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా పరిశ్రమల్లో కొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రారంభించారు. బెల్(బిఇఎల్)ను రూ. 500 కోట్లతో గోరంట్ల-పాలసముద్రం మధ్య నిర్మించనున్నారు. ఇక్కడ రాడార్, ఆయుధ వ్యవస్థకు టెస్ట్‌బెడ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 450 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే నాసెన్ అకాడమీ కేంద్రాన్ని గోరంట్ల-పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసేందుకు 500 ఎకరాల భూమి ఇప్పటికే సేకరించారు. ఈ కేంద్రం ద్వారా సుమారు 500 మంది ఉపాధి పొందే వీలుంది. సివిల్ పనులను కంపెనీ కాంట్రాక్టర్లు మొదలు పెట్టారు. మరోపక్క పాలసముద్రం వద్ద ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం 264 ఎకరాల భూమిని కేటాయించారు. రూ. 200 కోట్లతో ఎయిర్‌బస్ (ఎఐఆర్‌బియుఎస్) పేరుతో ఇక్కడ కంపెనీ ప్రారంభించనున్నారు. ఇందులో 1,500 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనుంది. ఇకపోతే ఇండస్ట్రియల్ పార్కులు, పారిశ్రామికవాడల (ఇండస్ట్రియల్ ఎస్టేట్స్) ఏర్పాటుకు జిల్లాలోని సోమందేపల్లి మండలం గుడిపల్లి సమీపంలో 1,111.09 ఎకరాలు, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో 1,031.91 ఎకరాలు కేటాయించారు. ఈ భూమిని ఎపిఐఐసి ద్వారా సేకరించారు.
ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో రూ. 16,300 కోట్ల పెట్టుబడితో 1,43,000 మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 14 పరిశ్రమల స్థాపకు ఎంఒయు కుదిరింది. నాసెన్, బెల్ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని, పనులు వేగవంతంగా చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆయా కంపెనీలకు సూచించారు. జిల్లాలో పరిశ్రమలు శీఘ్రగతిన పూర్తయితే సుమా రు 73 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగులతో పాటు అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జిల్లా లో ఇప్పటికే సిమెంట్, ఫార్మాస్యూటికల్స్, విండ్‌మిల్స్, ఇంజినీరింగ్, పెయింట్స్, స్టీల్ ఫ్యాక్టరీలు, గార్మెంట్స్ తదితర 44 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి తోడుగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న 19 పరిశ్రమలు పూర్తయితే జిల్లా నుంచి ఎగుమతులు పెరుగుతాయి.