బిజినెస్

1 నుంచి చమురు ఉత్పత్తి తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, డిసెంబర్ 12: తగ్గుముఖం పడుతున్న ధరలు పెంచడానికి, ఉత్పత్తులను స్థిరీకరించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల తయారీని తగ్గించడానికి చమురు ఉత్పత్తి సంస్థలు అంగీకరించాయని యూఏఈ మంత్రి తెలిపారు. ఒపెక్, నాన్ ఒపెక్ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని జనవరి ఒకటి నుంచి ఆరు నెలల పాటు తగ్గించాలని నిర్ణయించారని ఆయన చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల మదింపు జరిగే డిసెంబర్ త్రైమాసికానికి కొద్దిరోజులు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. చమురుకు డిమాండ్ తగ్గుతుందన్న భయాలు, ఉత్పత్తి పెరుగుతుందన్న అనుమానాలతో అక్టోబర్‌లో బ్యారల్ 85 డాలర్ల వరకు ఉన్న చమురు ధరలు ఇప్పుడు 60 డాలర్లకు దిగివచ్చింది. ఉత్పత్తి తగ్గింపుపై తాము తీసుకున్న నిర్ణయంపై ఏప్రిల్‌లో కలిసి సమీక్షిస్తామని యూఏఈ మంత్రి సుహైల్ ఆల్-మజ్‌రోయి బుధవారం విలేఖరులకు తెలిపారు. జాతీయ చమురు సంస్థ అడ్‌నాక్ జనవరి 1 నుంచి తాము చేసే ఉత్పత్తిని 2.5 శాతం తగ్గిస్తామని క్లయింట్లకు ఇప్పటికే తెలియజేసిందన్నారు. యూఏఈలోనే నాలుగో అతిపెద్ద ఉత్పత్తి సం స్థ అయిన ప్రస్తుతం 3.0 మిలియన్ల బిపీడీని పంపింగ్ చేస్తోందన్నా రు. వాస్తవానికి చమురు ఉత్పత్తిదారులు జూన్‌లో సమావేశం కావా ల్సి ఉండగా, వారు ఏప్రిల్‌లోనే తాము తీసుకున్న నిర్ణయంపై సమీక్ష జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. అనంతరం వారు తగి న నిర్ణ యం తీసుకుంటారని అన్నారు. తమ సంస్థల ఉత్పత్తిని తగ్గించడం వల్ల జనవరి నాటికి ప్రపంచమార్కెట్‌లో ఉన్న చమురు నిల్వల పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. చమురుకు డిమాండ్ తగ్గుతోందని తాము ఊహిస్తున్నామని, ఆ మేరకు ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ వస్తున్నామన్నారు. ఏప్రిల్‌లో ఒపెక్, నాన్ ఒపెక్ పార్టీల మధ్య సహకారం, సమన్వయం కోసం దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకాలు సైతం జరుగుతాయన్నారు. రష్యా, ఇతర ఉత్పత్తిదారులు పెట్రోలియం ఉ త్పత్తిచేసే దేశాల సమాఖ్య బలంగా ఉండాలని కోరుకుంటున్నాయన్నారు.