బిజినెస్

చారిత్రక పార్లే ప్లాంట్ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 30: ముంబయి లోకల్ రైలు ప్రయాణికులను విలె పార్లే స్టేషన్ రాగానే ఓ కమ్మటి సువాసన పలకరిస్తుంది. పక్కనే ఉన్న పార్లే బిస్కట్ తయారీ కర్మాగారం నుంచే వస్తుంది ఆ పరిమళం. తాజా బిస్కట్లు తింటున్నట్లుండే ఆ మధురానుభూతిని ప్రయాణికులెవరూ మరిపోలేరు. అయితే ఇప్పుడు ఆ అనుభూతి కలగడం లేదు. కారణం.. చారిత్రాత్మక ఈ పార్లే బిస్కట్ల కర్మాగారం మూతబడింది కనుక. అవును.. 87 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ప్లాంట్‌లో కొద్ది వారాల క్రితం ఉత్పత్తిని నిలిపివేసినట్లు స్థానిక వార్తా కథనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతం పేరునే తమ పేరుగా సంస్థ మార్చుకున్నప్పటికీ.. పార్లే సంస్థ మూలంగానే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఇంతలా ప్రాచుర్యం పొందిన ఈ చారిత్రాత్మక ప్లాంట్‌లో గత కొనె్నళ్లుగా నెలకొన్న నిర్లక్ష్యం.. చివరకు ప్లాంట్ ఉనికినే ప్రమాదంలో పడేసింది. ఇక గోప్యంగా ఈ ప్లాం ట్‌ను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చిన యజమాని చౌహన్ కుటుం బం.. ఇక్కడి ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 300 మంది కార్మికులు ఈ పథకంలో చేరుతున్నారు. అయితే ఇండ్లు, పార్లే ఉత్పత్తుల ప్రధాన కార్యాలయాలు కలిగిన ఈ ప్లాంట్ స్థలాన్ని అమ్మేందుకు చౌహన్ కుటుంబం సిద్ధంగా లేదు. భవిష్యత్ ప్రణాళికనూ ప్రకటించలేదు. 1929లో మొదలైన ఈ ప్లాంట్‌లో తొలుత క్యాండీస్‌ను మాత్రమే తయారు చేసేవారు. అయితే పదేళ్ల తర్వాత 1939 నుంచి ఇక్కడ పార్లే గ్లూకో పేరిట బిస్కట్లను తయారు చేయడం ఆరంభించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించాక.. గ్లూకో బ్రాండ్ బిస్కట్లను పెద్ద ఎత్తున పార్లే ప్రచారం చేసింది. బ్రిటీష్ బిస్కట్లకు భారతీయ ప్రత్యామ్నాయమని ప్రకటించింది. ఇది వ్యాపార రిత్యా పార్లేకు ఎంతగానో కలిసిరాగా, ఇప్పటికీ దేశంలో అత్యధికంగా తింటున్న బిస్కట్లు పార్లే బ్రాండే కావడం గమనార్హం. రోజుకు దాదాపు 400 మిలియన్ బిస్కట్లను పార్లే తయారు చేస్తోంది. ఇక 1980లో ప్రస్తుత పార్లే జి పేరుతో మార్కెట్‌లోకి బిస్కట్లు రావడం మొదలవగా, 2013లో రిటైల్ అమ్మకాలపరంగా 5,000 కోట్ల రూపాయల మార్కును దాటిన తొలి దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి బ్రాండ్‌గా పార్లే జి నిలిచింది. పార్లే జిలో జికి అర్థం గ్లూకోజ్, జీనియస్‌గా సంస్థ అభివర్ణిస్తోంది. ప్రస్తుతం భారతీయ బిస్కెట్ మార్కెట్‌లో 40 శాతం వాటా పార్లే సొంతం. మరో 15 శాతం వాటా మిఠాయిల మార్కెట్‌లో పార్లేకు ఉంది. పార్లే జి బిస్కట్లతోపాటు మోనాకో, హైడ్ అండ్ సీక్ బ్రాండ్ బిస్కట్లు, ఫ్రూటీ, అప్పీ క్లాసిక్, ఫిజ్ శీతల పానియాలు, మ్యాంగో బైట్ చాక్లెట్లను పార్లే తయారు చేస్తోంది. హర్యానా, రాజస్తాన్‌ల్లోనూ పార్లేకు భారీ తయారీ కేంద్రాలున్నాయ.

చిత్రం.. ముంబయి విలే పార్లేలోని పార్లే బిస్కట్ల తయారీ ప్లాంట్