బిజినెస్

బుల్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ కేంద్రం శక్తికాంత దాస్‌ను నియమించడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. అంతర్జాతీయ సూచీలు కూడా కలిసి రావడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్ దూకుడు కొనసాగింది. సెనె్సక్స్ సుమారు 630 పాయింట్లు పెరగడం రాబోయే రోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందనే సంకేతాలను పంపింది. ఆర్‌బీఐకి కొత్త గవర్నర్‌ను నియమించడంలో ఆలస్యం జరిగితే, స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగి ఉండేది. కానీ, అందుకు భిన్నంగా కేంద్రం సత్వరమే స్పందించింది. ఆర్‌బీఐకి 25వ గవర్నర్‌గా ఎంపికైన దాస్ కూడా ఆర్థిక వృద్ధికి, మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటానని ప్రకటించడంతో మదుపరుల్లో ఉత్సాహం పెరిగింది. ఫలితంగా బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 629.06 పాయింట్లు (1.92 శాతం) పెరిగి 35,779.07కు చేరింది. ఈవారం ఆరంభంలో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, మంగళవారం స్వల్పంగా కోలుకున్న మార్కెట్ బుధవారం లాభాల బాటలో పరుగులు తీసింది. సెనె్సక్స్‌తో పాటు నిఫ్టీలోనూ ర్యాలీ కొనసాగింది. 188.45 పాయింట్లు (1.79 శాతం) పెరిగిన నిఫ్టీ 10,737.60 పాయింట్ల వద్ద ముగిసింది. థర్టీ సెనె్సక్స్ స్టుక్స్‌లో దాదాపు అన్ని కంపెనీలు లాభపడ్డాయి. ప్రత్యేకించి రియల్టీ, ఆటో, మెటల్, కేపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ తదితర రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. హీరో మోటోకార్పొరేషన్ 7.01 శాతం పెరగడం విశేషం. ఈ షేర్లుకు ఇంత డిమాండ్ రావడాన్ని మార్కెట్ నిపుణులు కూడా ఊహించలేదు. కాగా, భారతీ ఎయిర్‌టేల్ 6.69 శాతం, అదానీ పోర్ట్స్ 4.90 శాతం, టాటా స్టీల్ 3.75 శాతం, బజాజ్ ఆటో 3.70 శాతం చొప్పున లాభపడ్డాయి. ద్రవ్య లబ్ధత ఎక్కువగా ఉండేలా ఆర్‌బీఐ కొత్త గవర్నర్ దాస్ నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం మార్కెట్‌పై సానుకూల ధోరణుకు కారణమైంది. మొత్తం మీద సెనె్సక్స్, నిఫ్టీ లాభాల బాటలో పరుగులు తీసింది.