బిజినెస్

త్వరలో దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫీ స్కీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా రైతు మాఫీ స్కీంను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కాగా ఈ విధానం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని రైతాంగం సంక్షేమానికి రుణమాపీ పరిష్కారం కాదని ఎస్‌బీఐ రీసెర్చి సంస్థ తెలిపింది. దీని బదులు ఆదాయాన్ని పెంచే పథకాలను ప్రవేశపెట్టాలని ఎస్‌బీఐ కోరుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆదాయాన్ని పెంచే మార్గాలను ప్రవేశపెడితే బాగుంటుందని పేర్కొంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందింది. ఈ రాష్ట్రాల్లో రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. దీని వల్ల వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అందుకే కేంద్రం రైతులకు రుణమాఫీ స్కీం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కొన్ని రాష్ట్రాలకే ఈ రుణమాఫీని పరిమితం చేసే అవకాశం కనపడుతోంది. మొత్తం రైతులందరికీ కాకుండా నిర్దేశించిన మార్గదర్శకాలను రూపొందించిన ఆ పరిమితులకు లోబడి ఉన్న రైతులకే రుణమాఫీని వర్తింప చేస్తారనిభావిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ప్రతిపాదనను ఆర్‌బీఐ, బ్యాంకర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల పరపతి విధానం దెబ్బతింటుంది. ఈ ఏడాది మే 19 తేదీ వరకు బ్యాంకులు దేశ వ్యాప్తంగా రైతులకు రూ.70వేల కోట్ల రుణాలు ఇచ్చాయి. రుణమాఫీ వద్దని రైతుల ఆదాయాన్ని పెంచే స్కీంను ప్రవేశపెట్టాలని బ్యాంకులు వత్తిడి తెస్తున్నాయి. రూ.50వేల కోట్లతోనే మంచి ఆదాయ మార్గాలను ప్రవేశపెట్టవచ్చని బ్యాంకులు నివేదిక ఇచ్చాయి. దేశంలో 21.6 కోట్ల చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. సాలీనా ప్రతి రైతు కుటుంబానికి రెండు విడతలుగా మొత్తం రూ.12వేలు ఇస్తే రూ.50వేల కోట్ల సొమ్ము ఖర్చవుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద వ్యవసాయానికి సాయం చేసే స్కీంను అమలు చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును బదిలీ చేస్తారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందించడంలో జరిగిన వైఫల్యాలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం వినూత్న స్కీంతో రానున్నట్లు బ్యాంకర్లు భావిస్తున్నారు.