ఆంధ్రప్రదేశ్‌

చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రంలో చిన్న బడ్జెట్‌తో సినిమాలను నిర్మించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి సినిమా పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. గురువారం నగరంలోని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక విధాలుగా రాయితీలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇందుకోసం జీవో నెం 116 ఇచ్చి రూ. 4 కోట్లతో రాష్ట్రంలో సినిమాలను నిర్మించే వారికి టాక్స్ తిరిగి ఇవ్వడంతోపాటు రూ. 10 లక్షలు తిరిగి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే 21 మంది నిర్మాతలు రాష్ట్రంలో సినిమాలు నిర్మిస్తామని ముందుకు రాగా ఇందులో ఐదుగురు ఇప్పటికే సినిమా షూటింగ్‌లు మొదలు పెట్టారన్నారు. రాష్ట్రంలో స్థానిక కళాకారులను, టెక్నిషియన్‌లు, మ్యూజిషియన్స్, రైటర్స్‌ను తయారు చేయడానికి రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. తాత్కాలికంగా నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఎన్టీఆర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పేరుతో 2019 సంక్రాంతి తరువాత మొదటి బ్యాచ్ 20 మందితో ఐదు రోజుల నుంచి 20 రోజుల నిడివిలో శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇది ఇంగ్లీష్, హిందీతో పాటు అవసరం మేర తెలుగులో కూడా ఉంటుందన్నారు. ఇప్పటికే 650 అప్లికేషన్లు ఆయా విభాగాల్లో శిక్షణకి వచ్చాయన్నారు.
వీరికి పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. 15 ఉత్తమ నాటకాలకు నంది బహుమతులు ఇచ్చామని తెలిపారు. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి 316 ఎకరాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసి సిద్ధంగా ఉంచిందన్నారు. ఇప్పటికే స్టూడియోలు నిర్మించడానికి ఏవీఎం సంస్థ 20 ఎకరాలు, హీరో నందమూరి బాలకృష్ణ 20 ఎకరాలు భూములు తీసుకున్నారన్నారు.
ఇంకా 10 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం భూములను వారికి కేటాయిస్తామన్నారు.