బిజినెస్

పుణెలో రెండు జావా అవుట్‌లెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: చాలా కాలం తర్వాత భారత్ మార్కెట్‌లో అడుగుపెట్టిన జావా మోటారుసైకిల్‌కు చెందిన రెండు ఔట్‌లెట్‌లను ప్రారంభించారు. గత నెలే భారత్‌లోకి అడగుపెట్టిన జావా మూడు మోడళ్లను లాంచ్ చేయనుంది. తమ మొదటి రెండు డీలర్‌షిప్‌లను పుణెలో ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వినియోగదారులు టెస్ట్‌రైడ్, బుకింగ్ చేసుకోవచ్చునని చెప్పారు. దేశంలో మొత్తం 100 మంది డీలర్లను ఏర్పాటు చేస్తామని, జావా మోటారు సైకిల్స్ తయారీ మహేంద్ర అండ్ మహేంద్ర సబ్సిడిరీగా వ్యవహరిస్తున్న క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. చాలానాళ్ల తర్వాత జావా మోటారు సైకిళ్లు భారత్‌లో అడుగుపెడుతున్నాయి. 293 సీసీ జావా ఫార్టీ టూ, జావా, జావా పెరాక్ మోడళ్లను నవంబర్‌లో ఆవిష్కరించింది. మహింద్రా అండ్ మహింద్రా 60 శాతం, మిగిలిన మొత్తాన్ని రుస్తుంజీ, ఫీ కేపిటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్‌గా వీటి తయారీని చేపట్టాయి. 2016లో మహింద్రా సంస్థ జెకొస్లేవియాకు చెందిన క్లాసిక్ లెజెండ్స్‌తో జావా మోటారుసైకిళ్ల రీ లాంచ్‌పై ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి మహింద్రా కంపెనీలలో తయారైనప్పటికీ జావా బ్రాండ్‌తో భారత్ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.