బిజినెస్

పదివేల వ్యాపారుల లైసెన్సులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: అక్రమాలకు పాల్పడుతున్న పదివేల మంది వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసింది చంద్రబాబు సర్కారు. తద్వారా వినియోగదారుల ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టింది. పాలనలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విధానంలో కూడా ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టింది. వేధింపులు లేని పన్నుల వసూళ్ల విధానం తీసుకురాగా, పారదర్శక విధానాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే అవినీతికి అడ్డుకట్ట వేస్తూ దొంగ వ్యాపారులపై కనె్నర్రజేసింది. ఇ-వేబిల్స్, టాక్స్ అనలిటిక్స్, చెక్ పోస్టుల ఆధునికీకరణ, యాప్స్ వినియోగం విస్తృత పరచడం వంటి సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అవినీతికి తావులేకుండా చేస్తోంది. అమ్మకందారు ఇన్వాయిస్ అప్‌లోడ్ చేయకపోతే, అధికారులు ముందు షోకాజ్ నోటీస్ ఇస్తారు. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే జరిమానా విధిస్తారు. మరోవైపు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనం నమోదయ్యేలా ఏర్పాట్లు చేశారు. వ్యాపారంలో అక్రమ లావాదేవీలు ఏమీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బోగస్ ఇన్వాయిస్‌లను నియంత్రించే విధానాలు అమలు చేస్తున్నారు. అవినీతి, లీకేజీలు, దౌర్జన్య పద్ధతులు, సిబ్బంది ఉదాశీనత వంటి వాటికి అడ్డుకట్ట వేస్తోంది. మాన్యువల్ బిల్లులను క్రమంగా తగ్గిస్తుండగా, ఆన్‌లైన్ వే బిల్లులను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. దాంతో చెక్ పోస్టుల వసూళ్లు రూ. 8.72 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ. 46 కోట్లకు పెరిగాయ. ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా అక్రమ పద్ధతులకు అడ్డుకట్ట వేసి, అన్ని స్థాయిలలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంచి ఫలితాలను రాబడుతున్నారు. వీటి ఆధునీకరణ బాధ్యతలను ఎపి రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఆర్‌డిసి)కు అప్పగించారు.
పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 52,618 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రాష్ట్రంలో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ. 52,618 కోట్లుగా నిర్దేశించారు. 2015-16లో పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 44,432 కోట్లు కాగా, రూ. 39,854 కోట్లు వసూలైంది. పనే్నతర ఆదాయం నిరుడు రూ. 4,499 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 5,495 కోట్లుగా నిర్ణయించారు. గత సంవత్సరం అమ్మ కం పన్ను వసూళ్లు రూ. 29,096 కోట్లయతే, వృత్తి పన్ను రూ. 249 కోట్లు వసూలైంది. అంటే వాణిజ్య పన్ను రూపంలో మొత్తం రూ. 29,345 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం అమ్మకం పన్ను రూ. 37,435 కోట్లు, వృత్తి పన్ను రూ. 344 కోట్లు, వినోదపు పన్ను రూ. 55 కోట్లు, లగ్జరీ, ఇతర పన్నులు రూ 71 కోట్లు కలిపి మొత్తం వాణిజ్య పన్నులు రూ. 37,905 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇక ఎక్సైజ్ పన్ను రాష్ట్రంలో నిరుడు రూ. 4,382 కోట్లుంటే, ఈ ఏడాది రూ. 5,756 కోట్లుగా నిర్దేశించారు. మోటార్ వెహికల్స్ పన్ను నిరుడు రూ. 1,986 కోట్లు వసూలవగా, ఈ ఏడాది రూ. 2,712 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం నిరుడు రూ. 3,584 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 5,180 కోట్లు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ఆదాయం రూ. 52 కోట్లవగా, ఈ ఏడాది రూ. 831 కోట్లుగా నిర్దేశించారు.